ఉస్మానియాలో అల్లుడిని చూసేందుకు వచ్చి తప్పిపోయిన వృద్ధురాలు


Wed,November 14, 2018 12:18 AM

-గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
-పోగొట్టుకున్న రూ.27,860 నగదు అందజేత
హిమాయత్‌నగర్ : ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న అల్లుడిని చూసేందుకు వచ్చిన వృద్ధురాలు దారి తెలియక తప్పిపోగా... నారాయణగూడ పోలీసులు గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ రమేశ్‌కుమార్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా, సింగటం గ్రామానికి చెందిన అనంతమ్మ(70) ఉస్మానియాలో చికిత్స పొందుతున్న అల్లుడు చిన్న బాపురెడ్డిని చూసేందుకు ఈ నెల 3న కూతురు లక్ష్మితో కలిసి నగరానికి వచ్చింది. అల్లుడిని చూసి దవాఖాన నుంచి బయటకు వచ్చిన అనంతమ్మకు తిరిగి లోనికి వెళ్లడానికి దారితెలియక నడుచుకుంటూ నారాయణగూడకు వచ్చింది. అనుమానాస్పదంగా కన్పించడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ప్రసన్నకుమార్, అశోక్‌సురేష్‌లు గుర్తించి ఆమెను ఆరాతీయగా... తన అల్లుడు ఉస్మానియాలో ఉండగా చూసేందుకు వచ్చానని, దారి తెలియక తిరుగుతున్నానని తెలిపింది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న బ్యాగును హరి విహార్ కాలనీలో పోగొట్టుకుంది. స్థానికుడు డాక్టర్ జనార్ధన్‌రెడ్డి గమనించి.. తన ఇంటి వద్ద ఓ సంచి పడి ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. సంచిలో రూ.27,860ల నగదుతో పాటు ఫొటోలు లభించడంతో అనంతమ్మకు సంబంధించిన సంచని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అప్పగించారు. సకాలంలో తన తల్లిని క్షేమంగా అప్పగించిన ందుకు కుమారుడు సంజీవరెడ్డి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...