ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్


Wed,November 14, 2018 12:16 AM

హయత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన జాతీయ సైన్స్, మ్యాథ్స్, పర్యావరణ ఎగ్జిబిషన్ మంగళవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి కె.సత్యనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సైంటిఫిక్ సొల్యూషన్స్ ఫర్ చాలెంజెస్ ఇన్ లైఫ్ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ సదస్సులో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హెల్త్ అండ్ క్లీన్‌నెస్, రిసోర్స్ మేనేజ్‌మెంట్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్ మోడలింగ్ విభాగాల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయస్థాయి విద్యార్థులకు డీఈవో సత్యనారాయణరెడ్డి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్‌ల ఏర్పాటు వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులు ఈనెల 24నుంచి 27తేదీ వరకు సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొంటారని తెలిపారు. అక్కడ ప్రతిభ కనబరిచి జిల్లాకు, మండలాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా నోడల్ అధికారి రాంచంద్రారెడ్డి, డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్దన్, డీఎస్‌వో రాజిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...