ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తా..


Tue,November 13, 2018 12:24 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలిరోజు టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కార్తీక సోమవారం మంచి రోజు కావడంతో రామ్మోహన్‌గౌడ్ తన సతీమణి బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి వెళ్లి ఎల్బీనగర్ సర్కిల్ రిటర్నింగ్ అధికారి ముకుందరెడ్డికి మధ్యా హ్నం 2.50 గంటలకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌తో రాజ్యాంగం పట్ల విశ్వాసంతో ఉండాలని ప్రమాణం చేయించారు. నామినేషన్ పత్రాలతో పాటు బీఫారాన్ని సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 19వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...