మలేరియా నివారణకు చర్యలు


Tue,September 25, 2018 12:37 AM

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: మలేరియా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉం డాలని, వ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిషోర్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధు నివా రణపై జీహెచ్‌ఎంసీ ఎంటమాలజి విభాగంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులతో బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పాల్గొని అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. నవంబర్ మాసాంతరం వరకు దోమల వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశముందని, ఈ రెండు నెలలపాటు విస్తృత స్థాయిలో దోమల నివారణ చైతన్య కార్యక్రమాలు నిర్వ హించాలని సూచించారు. గతంలో డెంగీ, మలేరియా కేసులు నమోదైన బస్తీల్లో ముందస్తుగా పెరి త్రియం స్ప్రేను విస్తృతంగా చేయాలన్నారు. అంటు వ్యాదుల నివారణ చైతన్య కార్య క్రమాల నిర్వహణలో భాగంగా నగరంలోని 1800 పాఠశాలల విద్యార్థినీ విద్యా ర్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ అధికా రులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజి విభాగం వద్ద ఉన్న 150పోర్టుల్, 10 ఫాగింగ్ మిషన్ కలిగిన వాహనాల ద్వారా ప్రతిరోజు కనీసం 150కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్ జరపాలన్నారు. మై జీహెచ్‌ఎంసీ యాప్, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్, ఇ-మెయిల్, వాట్సప్ తదితర మాద్యమాల ద్వారా దోమల బెడద, అంటు వ్యాధులపై అందే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పంధించి తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దోమల నివారణపై చైతన్యపర్చడానికి ఎల క్ట్రానిక్ మీడియా, పత్రికలు, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిం చాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమి షనర్ సందీప్‌జూ, చీఫ్ ఎంటామాలజి అధికారి వెంకటేష్‌లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...