ఆయుష్మాన్ భవ..


Mon,September 24, 2018 01:24 AM

కీసర: మంత్రి మహేందర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, కీసరగుట్ట వేదపండితులు ఆశీర్వదించారు. ఆదివారం మంత్రి పుట్టిన రోజు కావడంతో కీసరగుట్టలో దేవస్థానం చైర్మన్ రమేశ్‌శర్మ ప్రత్యేక పూజలు చేయించి, నేరుగా మంత్రి ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రితో పాటు జడ్పీ సునీతారెడ్డి దంపతులను సన్మానించి, ఆశీర్వచనం చేశారు. అలాగే, మండల నేతలు పెద్ద సంఖ్యలో మంత్రి ఇంటికి వచ్చి, జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ నేతలు నాను నాయక్, పోలు సంతోష్‌గౌడ్, కౌకుట్ల బాల్‌రెడ్డి, మణిపాల్‌రెడ్డి,తిరుపతిరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఎంవీఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
మంత్రి మహేందర్‌రెడ్డి జన్మదినాన్ని ఎంవీఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బంజారా హిల్స్‌లోని మంత్రి నివాసంలో కేక్ కట్ చేసి మంత్రికి తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఓఎస్డీ సుధాకర్ రెడ్డి, జేటీసీ పాండురంగనాయక్, డీటీసీ ప్రవీణ్‌రావు, ఎంవీఐ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు, ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...