రేపే వినాయక నిమజ్జనం


Sat,September 22, 2018 01:00 AM

- నగరంలో శోభాయాత్రకు సర్వం సిద్ధం
- నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
- యాత్ర రూట్లలో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- పలు కూడళ్లల్లో వాహనాల మళ్లింపు
- పశ్చిమం నుంచి తూర్పుకు బషీర్‌బాగ్ ైఫ్లెఓవర్ కింది నుంచి అనుమతి
- హెల్ప్‌లైన్ నెంబర్లు 040-27852482,9490598985, 9010203626
- పార్కింగ్ స్థలాల ఏర్పాటు : సీపీ అంజనీకుమార్
- సమస్య వస్తే సంప్రదించండి : ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. వినాయక శోభాయాత్ర సందర్భంగా ర్యాలీలు, వివిధ కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపు, నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు వచ్చే సాధారణ ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు తగిన స్థలాల వివరాలను ఆయన వివరించారు.

నిమజ్జనోత్సవ ప్రధాన ర్యాలీలు ఇవి...
- ప్రధాన వినాయక శోభాయాత్ర ర్యాలీ కేశవగిరి నుంచి మొదలై అలియాబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజె.మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. మార్గమధ్యలో పలు జంక్షన్ల నుంచి వచ్చిన ర్యాలీలు ఇక్కడ కలుస్తాయి.
- సికింద్రాబాద్ ఏరియా నుంచి ఆర్పీరోడ్, ఎంజేరోడ్, కర్బాల మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్‌రోడ్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఎక్స్‌రోడ్, హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ వద్ద ప్రధాన వినాయక శోభాయాత్ర ర్యాలీలో కలుస్తాయి. చిలకలగూడ ఎక్స్‌రోడ్ నుంచి వచ్చే వారు గాంధీ దవాఖాన వైపు నుంచి వచ్చి ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో కలుస్తాయి.
- ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట, ఓయూ ఎన్‌సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ దవాఖాన రూట్లో వచ్చే ర్యాలీలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోపైన తెలిపిన ర్యాలీలోకి కలుస్తాయి. దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్‌సాదన్, చంచల్‌గూడ, నల్గొండ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి. మూసారాంబాగ్ నుంచి అంబర్‌పేట మీదుగా వచ్చే వాహనాలు ఫీవర్ దవాఖాన మీదుగా వెళ్లాలి.
- టోలిచౌక్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ఓల్డ్‌సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, ఎన్టీఆర్ మార్గ్‌లోకి వెళ్లాలి. ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్ నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌కు వెళ్లాలి. టప్పాఛబుత్ర, అసిఫ్‌నగర్, సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గ హోటల్, గోషామహల్ బరాద్రి, అలస్క వైపు నుంచి వచ్చి ఎంజే మార్కెట్‌లోని ప్రధాన ర్యాలీకి కలువాలి.
పైన తెలిసిన రూట్లలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు విగ్రహాలతో తరలివెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ వాహనాలకు ఈ రూట్లలో అనుమతి ఉండదు.

ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్..
వినాయక విగ్రహాలతో వచ్చే వాహనాలు తప్ప మిగతా సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ, ట్రాఫిక్‌ను పలు కూడళ్లలో మళ్లిస్తున్నారు. బషీర్‌బాగ్ జంక్షన్‌లో మాత్రమే పశ్చిమం నుంచి తూర్పుకు రెండు వైపుల వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. నగరంలో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు నేపధ్యంలో వాహనదారులు రింగ్‌రోడ్డు, బేగంపేట్ రోడ్డులో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలోకి వచ్చి ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలతో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా శివారు ప్రాంతాల నుంచి వెళ్లడం మంచిదని చెబుతున్నారు. అన్ని ప్రధాన నిమజ్జనోత్స ర్యాలీ రూట్లకు బారీకేడ్లు, కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
హైదరాబాద్ సౌత్: కేశవగిరి, మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, మొగల్‌పురా, లక్కడ కోటె, మదీన ఎక్స్‌రోడ్, ఎం.జె.బ్రిడ్జి, దారు ఉల్ షిఫా ఎక్స్‌రోడ్స్, సిటీ కాలేజీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
హైదరాబాద్ ఈస్ట్ : చంచల్‌గూడ జైల్ ఎక్స్‌రోడ్స్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సాలార్‌జంగ్ బ్రిడ్జి(శివాజీ బ్రిడ్జి), అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలీ ఎక్స్‌రోడ్, ట్రూప్ బజార్, జాంబాగ్ ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంకు.
హైదరాబాద్ వెస్ట్: తోపెఖానా మాస్క్, అలస్క హోటల్ జంక్షన్, ఉస్మాన్‌గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర అజంతగేట్, అబ్కారి లేన్, తాజ్ ఐలాండ్, భర్తన్ బజార్, కేఎల్‌కే బిల్డిండ్ వద్ద ఏఆర్ పెట్రోల్ పంప్.
హైదరాబాద్ సెంట్రల్ : చాపల్‌రోడ్డు ఎంట్రీ, జీపీఓ దగ్గర గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కైలాన్ రోడ్ ఎంట్రీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంక్షన్ దోమల్‌గూడ, కంట్రోల్‌రూం దగ్గర కళాంజలి, లిబర్టీ జంక్షన్, ఎంసీహెచ్ అపీస్ వై జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద బీఆర్‌కే భవన్ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్(విశ్వేశ్వరయ్య విగ్రహం), చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ ఎక్స్‌రోడ్, లోయర్ ట్యాంక్ బండ్‌లోని కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్కు జంక్షన్.
హైదరాబాద్ నార్త్(సికింద్రాబాద్): కర్బాల మైదాన్, బుద్ద భవన్ జంక్షన్, షెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ల వద్ద నుంచి నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. సీటీఓ, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్, ప్యాట్నీ ఎక్స్‌రోడ్, బాట ఎక్స్ రోడ్, అడవయ్య ఎక్స్‌రోడ్, గాన్స్ మండి ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ కూడళ్ల నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.

పార్కింగ్ స్థలాలు
- గణేశ్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు హుస్సేన్‌సాగర్‌కు వచ్చే సాధారణ పౌరులు, భక్తులు తమ వాహనాలను ఈ కింద తెలిపిన ప్రాంతాల్లో పార్కు చేసుకోవాలి.
- ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఆఫీస్ వరకు, బుద్దభవన్ వెనుక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజి, పబ్లిక్ గార్డెన్స్‌లో పార్కు చేయాలి.
నిమజ్జనం తరువాత లారీలు వెళ్లాల్సిన రూట్
- నిమజ్జనాన్ని ఎన్టీఆర్ మార్గ్‌లో పూర్తి చేసుకున్న ఖాళీ లారీ లు, ట్రక్స్ నెక్లెస్‌రోడ్డు రోటరీ మీదుగా ఖైరతాబాద్ ైఫ్లెఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ వైపువెళ్లాలి. ఈ వాహనాలకు తెలుగుతల్లి విగ్రహం, మింట్ కంపౌండ్ వైపు అనుమతి ఉండదు.
- అప్పర్ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం పూర్తి చేసిన వాహనాలను చిల్డ్రన్స్ పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ వైపు వెళ్లాలి. బైబిల్ హౌస్‌వైపు అనుమతి లేదు.
అర్ధరాత్రి నగరంలోకి లారీల అనుమతి లేదు
నిమజ్జనం సందర్భంగా 23/24వ తేదీ రాత్రి ఇతర రాష్ర్టాలు, ఇతర జిల్లాలకు చెందిన వాహనాలకు నగరంలోకి అనుమతి లేదు. గణేశ్ నిమజ్జనోత్సవం చివరిరోజు కావడంతో రాత్రి ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో ఆయా వాహనాలను శివారు ప్రాంతాల్లోని రూట్ల నుంచి తమ గమ్యస్థానాల వైపు వెళ్లాలి.
ఆర్టీసీ సిటీ, జిల్లా, రాష్ట్ర బస్సులకు కూడా వర్తింపు..
పైన తెలిపిన ట్రాఫిక్ మళ్లింపు జంక్షన్లు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. వినాయక శోభాయాత్రలో వాహనాల రద్దీ పెరిగిన తరువాత ఆర్టీసీ బస్సులు ఈ కింద తెలిపిన జంక్షన్ల వద్ద వరకే పరిమితం కావాలి.

- మెహిదీపట్నం బస్సులు మాసాబ్‌ట్యాంక్ వరకు, కూకట్‌పల్లి బస్సులు ఖైరతాబాద్ జంక్షన్ వీవీ విగ్రహం, సికింద్రాబాద్ బస్సులు సీటీఓ, ప్లాజా, ఎస్‌బీహెచ్, క్లాక్‌టవర్, చిలకలగూడ ఎక్స్‌రోడ్, రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్‌సుఖ్‌నగర్ బస్సులు గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్ వరకు, రాజేంద్రనగర్ బస్సులు దానమ్మ హాట్స్‌వరకు, మిథాని బస్సులు ఐఎస్ సదన్ వరకు, ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులు వైఎంసీఏ నారాయణగూడ, జమై ఉస్మానియా ైఫ్లెఓవర్ వైపు వచ్చే వాహనాలు తార్నాక వద్దనే ఆగిపోవాలి.
ఇతర రాష్ర్టాలు.. జిల్లాల నుంచి వచ్చే బస్సులు
- రాజీవ్ రహదారి, ఎన్.హెచ్-7 వైపు నుంచి వచ్చే బస్సులు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ ఎక్స్‌రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా ైఫ్లెఓవర్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్ మీదుగా ఎంజీబీఎస్(ఇమ్లీబన్)కు వెళ్లాలి.
- బెంగళూర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఆరంగర్ ఎక్స్ రోడ్, చంద్రాయణగుట్ట ఎక్స్‌రోడ్, ఐఎస్ సదన్, నల్గొండ ఎక్స్ రోడ్, చాదర్‌ఘాట్ వైపు నుంచి వెళ్లాలి.
- ముంబై రోడ్డులో వచ్చే వాహనాలను గోద్రెజ్ వైజంక్షన్, నర్సాపూర్ ఎక్స్‌రోడ్, బోయిన్‌పల్లి, జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్, తార్నాక, జమై ఉస్మానియా ైఫ్లెఓవర్, అడిక్‌మెట్, నింబోలి అడ్డా మీదుగా వెళ్లాలి.
- ఈ వాహనాలకు 23వ తేదీ ఉదయం 10నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు సిటీలోకి అనుమతి లేదు.
- ప్రైవేట్ బస్సులు శివారు ప్రాంతాల నుంచే నడుపుకోవాలి. నగరంలోకి అనుమతి లేదు.
- ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు, అక్కడి నుంచి నగరంలోకి వచ్చే వారు ప్రధాన ర్యాలీ జరిగే రోడ్డుతోపాటు నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేదారుల్లో కాకుండా, ప్రత్యామ్నాయ దారులలో వెళ్లాలి.

గణేశ్ నిమజ్జనంలో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
ఆది, సోమ వారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గణేశ్ నిమజ్జనోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆది, సోమవారాలలో ఆయన పర్యటించే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1.55 నుంచి 2.25గంటల వరకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం వరకు. ఆయన నివాసం నుంచి సాయం త్రం ఎన్టీఆర్‌మార్గ్‌లో గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. బంజారాహిల్స్, పంజాగుట్ట ైఫ్లెఓవర్, మోనప్పజంక్షన్, యశోద దవాఖాన, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ైఫ్లెఓవర్, నెక్లెస్ రోటరీ నుంచి క్రేన్ నం.4 వద్దకు వెళ్తారు. అక్కడ వేడుకలో పాల్గొని తిరిగి అదే రూట్‌లో తన నివాసానికి చేరుకుంటారు. సోమవారం ఉదయం 9.20 నుంచి 10.15గంటల వరకు, బంజారాహిల్స్ నుంచి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వరకు, ఆ తరువాత 11.15 నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం వరకు, మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 గంటల మధ్య బంజారాహిల్స్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.

సాధారణ వాహనాలకు అనుమతి లేదు: ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు పూర్తి చేశామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా, శాంతి భద్రతల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్ విభాగం నుంచి తీసుకుంటున్న వివిధ చర్యల గూర్చి శుక్రవారం ట్రాఫిక్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్‌కుమార్ వివరాలను వెల్లడించారు. ట్రాఫిక్ విభాగం నుంచి 2,100 మంది సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. అందులో ఇద్దరు డీసీపీలు, నలుగురు అదనపు సీపీలు, 10 మంది ఏసీపీలు, 32 మంది ఇన్‌స్పెక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. నిమజ్జనానికి వచ్చే రూట్లను 38 సెక్టార్లుగా విభజించామన్నారు. అందులో ప్రధాన ర్యాలీ బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటుందన్నారు. ఇలా నగరంలోని నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వచ్చే ర్యాలీలను పరిగణనలోకి తీసుకొని, ప్రతి కూడలిలో ఒక ఎస్సై స్థాయి అధికారి బందోబస్తులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా ప్రధాన ర్యాలీ కొనసాగే రూట్లలోకి సాధారణ ట్రాఫిక్ అనుమతి ఉండదన్నారు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో సాధారణ వాహనాలను అనుమతించమని వివరించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు ఓఆర్‌ఆర్/పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేను ఉపయోగించుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాటు చేస్తున్న హెల్ప్‌లైన్‌ను సామాన్య ప్రజలు వాడుకోవాలన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...