మహాగణపతి నిమజ్జనానికి వేళాయె..


Sat,September 22, 2018 12:58 AM

ఖైరతాబాద్: ఆదివారం ఉదయం సప్తముఖుడి శోభాయాత్ర ప్రారంభమవుతున్నది. శుక్రవారం సాయంత్రం గణేశుడి ప్రాంగణానికి భారీ ట్రాలీ చేరుకున్నది. నీటిపారుదల శాఖ మెకానికల్ విభాగానికి చెందిన వర్కర్లు గణేశుడు ఆసీనులయ్యే పీఠాన్ని ట్రాలీపై అమర్చుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం నుంచి వెల్డింగ్ పనులు ప్రారంభించారు. ఈ పనులు శనివారం ఉదయం 7గంటల వరకు పూర్తవుతాయి. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతికి తొలి నిమజ్జనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ సారి కూడా తొలి నిమజ్జనం..
గత ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని తొలి నిమజ్జనం చేసిన విధంగానే ఈ ఏడాది కూడా ఆ ఘట్టాన్ని పూర్తి చేస్తారు. గణేశుడి శోభాయాత్ర ఆదివారం ఉదయం 9గంటలకు ప్రారంభమవుతున్నది. ఒక రోజు ముందే శనివారం గణేశుడిని ట్రాలీపైకి చేర్చి ఆదివారం తెల్లవారుజామున సిద్ధం చేస్తారు. గణపతి ప్రాంగణం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర సెన్‌షేన్ థియేటర్, తెలుగుతల్లి ైఫ్లెఓవర్, లుంబీనీ పార్కు మీదుగా నాల్గవ నంబరులో సిద్ధంగా ఉంచిన క్రేన్ వద్దకు చేరుకుంది. 11.30 గంటలకు సాగర్‌కు చేరుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఒక గంటల లోపే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...