ప్రశాంతంగా బీబీకా ఆలం ఊరేగింపు


Sat,September 22, 2018 12:58 AM

చాదర్‌ఘాట్: మొహర్రంను పురస్కరించుకుని బీబీ కా ఆలం ఊరే గింపు ప్రశాంతంగా ముగిసింది. చాదర్‌ఘాట్‌లోని ఇలాయి మసీ దు వద్ద ఆలంలను షియా ముస్లిం మత పెద్ద శాంతింప చేయడంతో తుది ఘట్టం పూర్తయ్యింది. షియా ముస్లింలు ఆద్యంతం మా తం లో భాగం గా రక్తాన్ని చిందిస్తూ స్మరించా రు. పాతనగరం మొత్తం షియా ముస్లిం లతో పాటు ఆలం ఊరేగింపును వీక్షించేందుకు భక్తులు తరలి రావడంతో రోడ్లన్నీ కిటకిటలాడా యి. ఆలంల ఊరేగింపు రజిన ఏనుగు పై ఇలా యి మసీదుకు చేరుకోగానే వాటిని శాంతింప చేసి కొద్దిసేపటి తరు వాత ఏర్పాటు చేసిన మరో వాహనంలో పంపించారు. ఆలం లు శాం తింప చేసే చోట కూడా మెటల్ డిటెక్టర్ సహాయంతో వచ్చిన వారం దరిని పోలీసులు పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. ఉదయం డిటెక్టివ్ వింగ్ డీసీపీ మహం తి దర్బార్ మైసమ్మ దేవా లయం, ఇలాయి మసీదు, సమీప ప్రాంతాల్లో చేపట్టిన భద్రత ఏర్పా ట్లను పరిశీలించారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన, చాదర్‌ఘాట్ ఎస్‌హెచ్‌ఓ జి.రమేశ్‌లు బందోబస్తు ను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...