బీసీలకు సముచిత ప్రాధాన్యం


Sat,September 22, 2018 12:57 AM

-ఏజీ శివప్రసాద్‌కు ఘన సన్మానం
రవీంద్రభారతి : తెలంగాణ న్యాయవాదుల సంఘం శుక్రవారం రవీంద్రభారతిలో నూతన అడ్వకేట్ జనరల్ బి.శివానంద్‌ప్రసాద్‌ను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఏజీ మాట్లాడుతూ అడ్వకేట్ జనరల్‌గా ప్రభుత్వం నన్ను నియమించడం బీసీల సమష్టి విజయమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అన్నివర్గాలకు సముచిత న్యాయం జరుగుతున్నదన్నారు. నాలుగున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. అడ్వకేట్ జనరల్‌గా తనపై ముఖ్యమంత్రి ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, చట్టపరంగా ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఎల్‌బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ 70 ఏండ్ల స్వాతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం సీఎం కేసీఆర్ చేశారని, బీసీ వర్గానికి చెందిన బి.ఎస్.ప్రసాద్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించి సామాజిక న్యాయం పాటించారన్నారు. ప్రతిభకు కులం అడ్డురాదని నిరూపించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సృజనాత్మకత, కొత్తదనంతో పాలన చేస్తున్నారని కొనియాడారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యవర సభ్యులతోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. అధ్యక్షుడు పుల్ల కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, దామోదర్‌రెడ్డి, ఉపేంద్ర, శంకర్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...