అభివృద్ధే ఆశీర్వదిస్తుంది


Fri,September 21, 2018 12:41 AM

హస్తినాపురం, సెప్టెంబర్ 20: సీఎం కేసీఆర్ చేసిన అభివృద్దే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేటర్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్‌లోని భూపేశ్‌గుప్తనగర్‌కాలనీలో ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, స్థానిక కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్ దలిత, బహుజనుల అభ్యున్నతికి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వేల కోట్ల నిధులు వెచ్చించడమే కాకుండా ప క్కా భవనాలు, హైదరాబాద్ వంటి మహానగరం లో 5 నుంచి 10 ఎకరాల ఖరీదైన భూమిని కేటాయించి అందరికీ సరైన భరోసా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అడుగడుగున తా కట్టుపెట్టిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీనాయకులదన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో కం టే ఎన్నో విధాలుగా మెరుగైన అవకాశాలు ఉన్నందున టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కే సీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు పొందుతున్న వారిని కనీసం ఇద్దరి చొప్పున ఓటు వేయించాలని సూచిస్తూ.. ప్రచారపర్వం కొనసాగించాలన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...