లక్ష మెజార్టీతో గెలుస్తాం : ఎంపీ మల్లారెడ్డి


Fri,September 21, 2018 12:41 AM

మన్సూరాబాద్: ప్రభుత్వ అభివృద్ధిపనులే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయనీ, ఎల్బీనగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాగోల్ డివిజన్ పరిధి ప్రెస్‌కాలనీలో గురువారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, అనంతరం కాలనీలో తిరుగుతూ రామ్మోహన్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి జరిగిందనీ, రాబోయేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత, నాయకులు పోచబోయిన గణేశ్‌యాదవ్, ప్రమీల, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...