కౌన్సిలర్లకు వేతనాలు పెంపు హర్షనీయం


Thu,September 20, 2018 02:20 AM

బషీర్‌బాగ్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రభుత్వం 97 జీవో ద్వారా వేతనాలు పెం చడం హర్షనీయ మని తెలంగాణ మున్సిపల్, నగర పంచాయతీ కౌన్సిలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్‌ఎన్ ప్రసాద్ అన్నారు. గతంలో కౌన్సిలర్‌కు రూ.2500 గౌరవ వేతనం ఉండేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.5 లక్షల వరకు టెండర్ లేకుండా మున్సిపాలిటీల్లో పనులు చేసేందుకు వెసులుబాటు కల్పించారన్నారు. గతంలో జీవో 91 విధానం వల్ల ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లమని, ఈ జీవోను సవరించి ఎంతో న్యాయం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నీలం శ్వేత, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగౌడ్, గోవర్దన్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...