మాటలు చెప్పలేని భావాలు ఫొటోలు అందిస్తాయి


Thu,September 20, 2018 02:19 AM

రవీంద్రభారతి : మాటల ద్వారా వ్యక్తం చేయలేని ఎన్నో భావాలను అందించేవి ఫొటోలు అని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రవీం ద్రభారతిలో తెలంగాణ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచయిత్రి , ఫొటోగ్రాఫర్ రావులపల్లి సునీత రూపొందించిన ప్రకృతిలోనికి ప్రయాణంపుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి తొలి ప్రతిని సి.పి.ఐ.నేత పువ్వాడ నాగేశ్వరరావుకు అందించారు. ఈ పుస్తకంలోని చిత్రాలు భావితరాలకు స్ఫూర్తిని అందించేలా ఉన్నాయన్నాయి. దేశ విదేశాల్లో ఆమె కష్టపడి తీసిన చిత్రాలు ఈ పుస్తకంలో పొందుపరచటం విశేషం అన్నారు. సి.పి.ఐ.నేత పువ్వాడ నాగేశ్వ రరావు మాట్లాడుతూ సునీత తీసినచిత్రాలు మనసుకు హత్తుకునేలా ఉన్నా య న్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మా ట్లాడుతూ నగరీకరణలో మనం కోల్పోతున్న ప్రకృతిని ఒడిసిపట్టి సునీత ఫొటోల రూపం లో అందించిందన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లా డు తూ సునీతలో ఫొటో జర్నలిస్టు ఉన్నాడన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ నాగే శ్వరావు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాషా సాం స్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, విశ్వేందర్ రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్ కోశాధికారి సుధాకర్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు చైతన్య సాగర్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...