జోరుగా వ్యర్థాల తొలిగింపు


Thu,September 20, 2018 02:16 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాల వెలికితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిమజ్జన ఘట్టం సందర్భంగా పెద్దఎత్తున ఏర్పడిన చెత్త, వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు తొలగించడానికి జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం, హెచ్‌ఎండీఏ విభాగాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. గడిచిన ఏడు రోజులుగా హెచ్‌ఎండీఏ 640 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించింది. ఎక్సావేటర్, ట్రాష్ కలెక్టర్, డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాప్టు (డీయూసీ) యంత్రాలు పూర్తిగా నీళ్లలోనే ఉండి సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాలు నీటి లోతుల్లోకి జారిపోకుండా క్షణాల్లోనే వెలికితీసి సమూలంగా గట్టుకు చేర్చుతున్నారు. వ్యర్థాల వెలికితీత సమయంలో ప్రజలు, వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని, వ్యర్థాల తొలగింపు పనులు వచ్చే సోమవారం వరకు జరుగుతాయని ఇంజినీర్లు వెల్లడించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...