కిడ్నాప్ కేసులో ఇద్దరు అరెస్ట్


Thu,September 20, 2018 02:15 AM

-పరారీలో మరో నలుగురు
మన్సూరాబాద్ : ఆటోలో వచ్చి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడి , కిడ్నాప్ చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఎల్బీనగర్, బండ్లగూడ, ఇంద్రప్రస్థకాలనీలో కొల్లు సత్యరాజు (28), వెంకటలక్ష్మి దంపతులు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. సత్యరాజు కార్పెంటర్‌గా పని చేస్తున్నా డు. కాగా... సత్యరాజు జీడిమెట్ల, సూరారం, శివాలయం వీధికి చెందిన ఆటో డ్రైవర్ చాకలి దుర్గయ్య (28) భార్యతో తరుచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. విష యం తెలిసిన దుర్గయ్య... ఈనెల 17న రాత్రి 9 గంటల సమయంలో బండ్లగూడ, ఇంద్రప్రస్థకాలనీలో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లా, ఎల్లారెడ్డికాలనీకి చెందిన తుక్కన నర్సింహా (40), రాంబాబు, లింగం, కవిత, సావిత్రిలతో కలిసి ఆటోలో వచ్చారు. అంతలోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన సత్యరాజుపై కర్రలతో దాడి చేసి.. ఆటోలో తీసుకెళ్లారు. సత్యరాజు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జీడిమెట్ల క్రాస్ రోడ్డులో బుధవారం దుర్గయ్య, నర్సింహాలను అదుపులోకి తీసుకుని... సత్యరాజును విడిపించా రు. అలాగే కేసుతో సంబంధం ఉన్న రాంబాబు, లిం గం, కవిత, సావిత్రిల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...