సురక్షిత ప్రయాణానికి... పోలీసుల బాట


Tue,September 18, 2018 03:22 AM

-సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల అధ్యయనం
-474 రహదారులపై గుంతలు పడ్డట్లు గుర్తింపు
-జీహెచ్‌ఎంసీ అధికారులకు వాటి ఫొటోలు అందజేత
-కోఆర్డినేషన్‌తో మరమ్మతుకు చర్యలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాహనదారుడి భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు బాధ్యతాయుతమైన చర్యలను తీసుకుంటున్నారు. వాహనదారులు సురక్షిత ప్ర యాణం కోసం రోడ్లపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు ఓ అధ్యయనం చేపట్టారు. వర్షం, గణేశ్ నిమజ్జనం, ఇతర కారణాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని 9 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ట్రాఫిక్ జా మ్‌ల కారణాలపై అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే 9 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దాదాపు 474 ప్రాంతా ల్లో రోడ్లు దెబ్బతిని, గుంతలు పడి ఉన్నట్లు గు ర్తించారు. వాటి ఫొటోలను తీసి లొకేషన్ ఆచూకీతో సహా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోన ల్, సర్కిల్ కార్యాలయాలకు పంపారు. వాటిని పూడ్చే ప్రక్రియలో గందరగోళం లేకుండా సమన్వయం కోసం సంబంధిత ట్రాఫిక్ పోలీస్ అధికారి ఫోన్ నంబర్లను అందుబాటులో పెట్టారు. ఇలా వాహనదారుడి సాఫీ ప్రయాణానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కోఆర్డినేషన్‌తో వాటిని త్వరలోనే పూడ్చి సురక్షిత ప్రయాణానికి బాట వేయడానికి శ్రీకారం చుట్టారు.

మాదాపూర్-53, గచ్చిబౌలి-55, మియాపూర్-40, కూకట్‌పల్లి-103, బాలానగర్ -78, జీడిమెట్ల-27, అల్వాల్-53, శంషాబాద్ ఆర్‌జీఐ-7, రాజేంద్రనగర్-58 ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, గుంతలు ఉన్నట్లు గుర్తించారు. ఈ చిన్న చిన్న కారణాలతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో వాటిని పరిష్కరిస్తే వాహనదారుడి ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని భావించిన సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్ సారథ్యంలో చేసిన ఈ ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా సమస్యల పరిష్కారం కోసం ట్రా ఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి రావడంతో వాహనదారులకు ప్రమాద రహిత రోడ్లు అందనున్నాయి.

సమన్వయంతో పని చేస్తాం...
రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. వారితో సమన్వయ పర్చుకుంటున్నాం. జీహెచ్‌ఎంసీ అధికారుల సహకారంతో త్వరలో వాటిని పూ డ్చివేస్తాం. రహదారిపై సురక్షిత ప్రయాణం లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి మెలిసి ముందుకువెళ్తున్నాం. మా బాధ్యతగా తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ఫొటోలతో కూడిన సమాచారాన్ని అందజేస్తున్నాం.
-ఎస్‌ఎం.విజయ్‌కుమార్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...