31,378 మందికి కంటి పరీక్షలు


Wed,September 12, 2018 12:56 AM

-7,617 మందికి కండ్లద్దాలు
-2,463మంది శస్త్రచికిత్సలకు సిఫారసు
కంటివెలుగు కార్యక్రమం గ్రేటర్‌లో విజయవంతంగా సాగుతున్నది. అనేకమంది తమతమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ఒక్క మంగళవారమే 31,378 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఇందులో 7,617 మందికి అద్దాలు పంపిణీ చేయగా, 2463 మందికి శస్త్రచికిత్సల కోసం రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే చార్మినార్ జోన్‌లో 6368, ఎల్బీనగర్‌లో 5578, ఖైరతాబాద్‌లో 4734, శేరిలింగంపల్లిలో 3178, సికింద్రాబాద్ 5559, కూకట్‌పల్లి జోన్‌లో 5961 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు. గత ఆగస్టు 15న కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...