31,763 మందికి కంటి వెలుగు


Tue,September 11, 2018 12:23 AM

-8053మందికి కండ్లద్దాలు
-2827మందికి శస్త్రచికిత్సలకు సిఫారసు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో సోమ వారం 31763 మందికి కంటి పరీక్షలు నిర్వహించిట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఇందులో 8053 మందికి కంటి అద్దాలు పంపిణీచేయగా, 2827మందికి శస్త్రచికిత్సలు జరిపేందుకు రిఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే, చార్మినార్‌జోన్‌లో 7186, ఎల్బీనగర్‌లో 5498, ఖైరతాబాద్‌లో 4939, శేరిలింగంపల్లిలో 2928, సికింద్రాబాద్ 5678, కూకట్‌పల్లి జోన్‌లో 5534మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు. ఇదిలావుండగా, కమిషనర్ దానకిషోర్ పలుప్రాంతాల్లో కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. అంబర్‌పేట్, గోల్నాక ప్రాంతాల్లోని కేంద్రాలను ఈ సందర్భంగా ఆయన సందర్శించి కంటి పరీక్షలు జరుగుతున్న తీరును, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. గత ఆగస్టు 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాగా, అప్పటినుంచి గ్రేటర్‌లోని 150కేంద్రాల్లో విజయవంతంగా కొనసాగుతోంది.

గ్లకోమా బాధితులకు విముక్తి
నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన కంటి వెలుగు వైద్య శిబిరాలు గ్లకోమా బాధితుల పాలిట వరంగా మారింది. సాధారణంగా గ్లకోమా బాధితులకు శస్త్రచికిత్స చేయాలంటే కార్పొరేట్ దవాఖానల్లో సుమారు రూ. 10వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చవుతుందని, కంటి వెలుగు పుణ్యమా అని నయా పైస ఖర్చులేకుండా గ్లకోమా బాధి తులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికా రులు తెలిపారు. గత నెల 15న ప్రారంభమైన కంటి వెలుగు వైద్య శిబిరాల్లో గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 4లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో మొత్తం 1806మందికి గ్లకోమా సమస్య ఉండగా వారిలో వెయ్యిమందికి వ్యాధి ముదిరి దృష్టి లోపం ఏర్పడినట్లు వైద్యు లు గుర్తించారు. వీరందరికీ నయా పైస ఖర్చులేకుండా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు వైద్యులు రిఫర్ చేశారు. అందులో ఇప్పటికే కొంత మందికి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వ హించారు. గ్లకోమాను నిర్లక్ష్యం చేస్తే చూపు పూర్తిగా కోల్పో యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో చాలా మంది వ్యాధిని నిర్లక్ష్యం చేసి అంధత్వానికి దగ్గర య్యా రని, కంటి వెలుగు ద్వారా ఎంతో మంది బాధితులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు. రెండు రోజుల విరామం తరువాత సోమవారం ప్రారంభమైన కంటి వెలుగులో గ్రేటర్ వ్యాప్తంగా 31, 763మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...