ఉచితంగా..మట్టి గణపతులు


Mon,September 10, 2018 12:57 AM

-గ్రేటర్‌లో 1.40 వేలవిగ్రహాల పంపిణీ
-రేపు, ఎల్లుండి 10- 15 స్టాళ్లలో అందజేత
-ఏర్పాట్లు పూర్తిచేసిన కాలుష్య నియంత్రణ మండలి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణహిత మట్టి గణపతుల పంపిణీకి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల విగ్రహాలను ఉచితంగానే భక్తులు అందజేయనున్నది. ఇప్పటికే తయారీ సహా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిన బోర్డ్ అధికారులు మంగళ, బుధ వారాల్లో పంపిణీ ప్రక్రియను చేపట్టబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెలితే.. వినాయక చవితిని పురస్కరించుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీవోపీ) విగ్రహాలను తగ్గించి మట్టి విగ్రహాలను వినియోగంలోకి తెచ్చేందుకు బోర్డ్ గత కొంత కాలంగా కృషి చేస్తున్నది. పీసీబీ ప్రయత్నాలు సఫలీకృతమై మట్టి విగ్రహాలే అధికంగా కొలువుదీరుతున్నాయి. విగ్రహాలు కావాలంటూ జనం నుంచి ప్రతీ ఏడు విపరీతమైన డిమాండ్ నెలకొంటున్నది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బోర్డ్ వర్గాలు ఈ ఏడు రెండు లక్షల విగ్రహాలను తయారుచేయించారు. నెలన్నర క్రితమే ఓపెన్ టెండర్లను ఆహ్వానించిన బోర్డ్ అధికారులు పలువురు తయారీదారులకు టెండర్లను ఖరారు చేశారు. ఇప్పటికే విగ్రహాల తయారీ ప్రక్రియ పూర్తికాగా రెండు రోజులపాటు విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.

ఉచితంగానే..
విగ్రహాలు కావాలనుకునే ఆశావాహుల నుంచి పీసీబీ అధికారులకు ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. ఆయా దరఖాస్తును పరిశీలించి బోర్డ్ అధికారులు విగ్రహాలను అందజేయనున్నారు. ఇక దరఖాస్తు చేయని వారి కోసం పలు ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విగ్రహాలను ఉచితంగా అందజేయనున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసి విగ్రహాలను పంపిణీ చేయాలన్న అంశంపై పీసీబీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. స్టాళ్ల ఏర్పాటు అంశంపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముందని, ఆయా ప్రాంతాల్లో తాము
ఏర్పా టు చేసే స్టాళ్లను సంప్రదించి విగ్రహాలు పొందవచ్చని పీసీబీ అధికారులు తెలిపారు. అత్యధికంగా సుమారుగా లక్షా 40వేల విగ్రహాలను గ్రేటర్‌లో పంపిణీ చేయబోతున్నారు. ఇందుకోసం నగరంలో 10-15 ప్రాంతాల్ల్లో స్టాళ్లను నెలకొల్పబోతున్నట్లు అధికారులు వివరించారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...