సమసమాజ స్థాపనే లక్ష్యం


Mon,September 10, 2018 12:48 AM

బేగంబజార్: ఆదర్శమైన సమాజస్థాపనే లక్ష్యంగా ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇం డియా (ఎస్‌ఐవో) రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతోందని ఎస్‌ఐవో తెలం గాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లయీఖ్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎస్‌ఐవో తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభను నిర్వహిం చారు. ఈ సదస్సులో హైదరాబాద్ ఎంపీ అసదుధ్దీన్ ఓవైసీ, జమాతే ఉలామే హింద్ జాతీయ ప్రధాన కార్యదర్శి మౌలానా మహమూద్ మదనీ,గుజరాత్ శాసన సభ్యు లు జిగ్నేశ్ మేవాని, జమాతే ఇస్లామి హింద్ ఉపాధ్యక్షులు సాదతుల్లా హుస్సేనీ, రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, జేఎన్‌యూ అదృశ్య విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీస్, ఎస్‌ఐవో జాతీయ అధ్యక్షులు నహస్‌మాలా, ముంభై హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బీవో కోల్స్ పాటిల్,జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ఖాలిద్, జమాతే ఇస్లా మిహింద్ రాష్ట్ర అధ్యక్షులు హమీద్ మహ్మద్ ఖాన్,ఎస్‌ఐవో రాష్ట్ర అధ్యక్షులు లయీ ఖ్ అహ్మద్ ఖాన్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ మహాసభలో భాగంగా వర్త మానా న్ని ప్రశ్నిద్ధాం -భవిష్యత్తును నిర్మిద్దాం అనే అంశంపై చర్చను నిర్వహించారు. రాష్ట్ర విశ్వ విద్యాలయాలలో విద్యార్థి సంఘ ఎన్నికలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన దోషులను వెంటనే శిక్షించాలన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...