ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కేసీఆర్


Mon,September 10, 2018 12:46 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దేవాంగుల కులానికి 3600 గజాల స్థలాన్ని, రూ. 75 లక్షలను కేటాయించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని తెలంగాణ దేవాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చోళ రాజేశ్వర్‌రావు పేర్కొ న్నారు. తమకు ఇచ్చిన హామీని విస్మరించకుండా, ఏకంగా జీవో నెంబర్ - 189ను విడు దల చేయడం హర్షణీయమని, ఇందుకు రాష్ట్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేవాంగుల సంక్షేమ సంఘ కార్యనిర్వాహక, కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం సంఘం అధ్యక్షుడు బత్తుల వీరభద్రరావు అధ్యక్షత అబిడ్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సం ఘం వ్యవస్థాపకులు దివంగత మాజీ ఐఏఎస్ బత్తుల భీమరాజుగారి జయంతి సంద ర్భంగా నివాళులర్పించారు. తదనంతరం తమకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకునేం దుకు వీలుగా జీవోను జారీచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. తమకు ఆత్మగౌరవ భవనాన్ని కేటాయించేందుకు చొరవచూపిన ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలకు సంఘ సభ్యులు ధన్యవా దాలు తెలిపారు. కాగా పత్రికా, ప్రసార మాధ్యమాల బాధ్యుడిగా ముప్పన జయసూర్యను నియమించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏకుల గోపి తదితరులు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...