హెచ్‌ఎండీఏకు పారిశ్రామిక శోభ


Mon,September 10, 2018 12:46 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి పారిశ్రామిక శోభను సంతరించుకుంటున్నది. టీఎస్ ఐపాస్‌లో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు భారీగా కంపెనీలు ముందుకువస్తుండగా, ఆయా కంపెనీల నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ నుంచే అనుమతులు పొందాల్సి ఉంటుంది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల పరిధిలోని 70 మండలాలు కలిపి 7257 స్కేర్ కిలోమీటర్ల మేర హెచ్‌ఎండీఏ సేవలను అందిస్తున్నది. ఇందులో భాగంగానే సంస్థ పరిధిలో నెలకొల్పే పరిశ్రమలు, పరిశ్రమల భవనాలకు టీఎస్ ఐపాస్ ద్వారా నిర్ణీత సమయంలో హెచ్‌ఎండీఏ అనుమతులు మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో 773 దరఖాస్తులను స్వీకరించిన హెచ్‌ఎండీఏ ఇందులో 168జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగా ఉన్న 526 పరిశ్రమల భవనాలకు అనుమతులు మంజూరు చేశారు.

పరిశ్రమలకు సంబంధించి ఆన్‌లైన్ ఆప్లికేషన్‌తో మొదలై సీఎంవోలోనే ఉన్న ఛేజింగ్ సెల్ పర్యవేక్షణలో జరుగుతుండగా, దరఖాస్తు చేసుకున్న 15 రోజుల వ్యవధిలోనే భూ వినియోగ మార్పిడి వంటి దరఖాస్తులు, భవన నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం అనుమతులు ఇస్తున్నది. అవినీతి రహితంగా కొనసాగే ఈ ప్రక్రియలో తమ వంతుగా సేవలందించి పారదర్శక అనుమతులు, సత్వర సేవలందించినందుకు గానూ ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ప్రశంసలు లభించడం గమనార్హం. నియమ నిబంధనలకు లోబడి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని, టీఎస్ ఐ పాస్ దరఖాస్తుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

సీఎల్‌యూ అనుమతులు వేగిరం...
హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతుల జారీలో భూ వినియోగ మార్పిడి ప్రత్యేకమైనది. రెసిడెన్సీ జోన్ ఉంటే మల్టీబుల్ జోన్‌కు మారడం, రెసిడెన్సీ జోన్లలో ఉంటే పరిశ్రమలు, గ్రీన్ బెల్డ్ జోన్‌లోకి, అగ్రికల్చరల్ టూ నాన్ అగ్రికల్చరల్, రోడ్లు ఉన్న చోట ఇతర జోన్‌లోకి మారడం లాంటివి భూవినియోగ మార్పిడిలో ప్రధాన అంశాలు. అయితే ఈ భూ వినియోగమార్పిడి మార్పునకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. టీఎస్ ఐ పాస్‌లో భాగంగా నాలుగున్నర సంవత్సరాల్లో 250 సీఎల్‌యూ దరఖాస్తులను స్వీకరించగా, 163 దరఖాస్తుల అనుమతి పొందాయి. 31 దరఖాస్తులు పేమెంట్ దశలో ఉండగా, వివిధ కారణాలతో 28 దరఖాస్తులను
తిరస్కరించారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...