ఆరుగురు ఆర్‌టీవోలకు డీటీసీలుగా అడహక్ ప్రమోషన్లు


Mon,September 10, 2018 12:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రవాణాశాఖలో ఆరుగురు ఆర్‌టీవో స్థాయి అధికారులకు జిల్లా రవాణా శాఖ అధికారులు (డీటీసీ)లుగా పదోన్నతి లభించనున్నది. అడహక్ ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు నాలుగు రోజుల క్రితం ఆదేశించడంతో అధికారులు ప్రమోషన్లపై ఆశతో ఉన్నారు. పదోన్నతులకు సంబంధించిన జాబితా కూడా ఇప్పటికే రవాణాశాఖ కమిషనర్ కార్యాలయం సిద్ధం చేయగా, సీనియారిటీ సవాల్‌చేస్తూ ఎస్‌టీఏలో ఆర్టీఓ క్యాడర్‌లో ఉన్న మహిళా ఉద్యోగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం అడహక్ ప్రమోషన్లు ఇవ్వాలని సూచించింది. డీటీసీ పోస్టులు ఆరు ఖాళీలుండగా, ఆరుగురు ఆర్‌టీవోలకు డీటీసీలుగా పదోన్నతి కల్పించి జిల్లాలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జాబితాలో ఉన్న కొంత మందిపై ఆరోపణలు ఉండటం.. అవన్నీ విచారణ దశలో ఉండటం, నిరూపణ కాకపోవడంతో పదోన్నతి ఇచ్చేందుకు 10మంది ఆర్‌టీవోల జాబితాను రవాణాశాఖ కార్యాలయం తయారుచేసి ప్రభుత్వానికి పంపించింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని 10మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. అందులో కామారెడ్డి ఆర్‌టీవో దుర్గాప్రమీల, నాగోల్ ఆర్‌టీవో పాపారావు, తిరుమలగిరి ఆర్‌టీవో వెంకటరమణ, మేడ్చ ల్ డీటీవో పుప్పాల శ్రీనివాస్, మంచిర్యాల ఆర్‌టీవో కిష్ణయ్య, ఖైరతాబాద్ ఆర్‌టీవో సి.రమేశ్, ఉప్పల్ ఆర్టీవో వెంకటేశం, ఎస్‌టీఏ ఆర్‌టీవో పురుషోత్తం, ఎస్టీఏడీలో ప్రిసీడింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.రాజరాజేశ్వరి, ఎస్‌టీఏలో పని చేస్తున్న కె.ప్రియంవద ఉన్నారు.

పది మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే అవకాశం దక్కనున్నది. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న సి.రమేశ్ గత నెలలో పదవీ విరమణ చెందాడు. పదోన్నతుల్లో సీనియారిటీ ప్రకారం దుర్గాప్రమీల, పాపారావు, వెంకటరమణ, పుప్పాల శ్రీనివాస్, పురుషోత్తంతోపాటు మరో ఆర్‌టీవోకు పదోన్నతి రానున్నట్లు తెలిసింది. ఆర్‌టీవో రమేశ్ పదవీ విరమణ చెందడంతో ప్రమోషన్ ఎవరికి వస్తుందనే చర్చ జరుగుతున్నది. రమేశ్‌కు కూడా ప్రమోషన్ ఇస్తూనే, సీనియారిటీని అనుసరించి డీటీసీ ఖాళీ భర్తీ చేయడానికి ఉప్పల్ ఆర్‌టీవో వెంకటేశంకు పదోన్నతి లభించవచ్చని ఊహాగాహనాలు వెలుపడుతున్నాయి. డీటీసీ పదోన్నతుల ప్రక్రియ ముగిసిన వెంటనే సీనియర్ ఎంవీఐలు, ఏవోలకు ఆర్‌టీవోలుగా పదోన్నతి పొందనున్నారు. ఇప్పటికే డీటీసీలు ఖాళీగా ఉండటంతో రవాణాశాఖలో పాలన ఇబ్బందిగా మారింది.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...