రెట్టింపు ఉత్సాహంతో..


Sun,September 9, 2018 12:38 AM

-ఇంటింటి ప్రచారాలతో టీఆర్‌ఎస్ జోరు
సిటీబ్యూరో : టీఆర్‌ఎస్ పార్టీ ప్రచార పర్వాన్ని ప్రారంభించి దూసుకుపోతున్నది. శనివారం సెలవుదినం కావడం, జనమంతా ఇండ్లల్లోనే ఉండే ఆవకాశముండటంతో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కృష్ణానగర్‌లో హనుమాన్ ఆలయంలో పూజల అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుట్టగా, ఎల్బీనగర్‌లో ముద్దగౌని రామ్మెహన్ గౌడ్‌గడ్డి అన్నారంలో భారీ సభను నిర్వహించి తనకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్వాన్ అభ్యర్థి జీవన్‌సింగ్ కార్యకర్తలతో భేటి కాగా, నాంపల్లి అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు పలువురు మద్దతు తెలిపారు. పాతబస్తీ క్రీడా సంఘం సభ్యులు చాంద్రాయణగుట్ట అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డిను సన్మానించి, గెలుపించుకుంటామని ప్రకటించగా, మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటామని మీర్‌ఖాన్‌పేట గ్రామస్తులు అభ్యర్థిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రాజేంద్రనగర్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ గండిపేట మండల పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్సీ, కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి సహా ఇతర టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా కార్పొరేటర్లు ముద్దం నర్సింహాయాదవ్, కాండూరి నరేంద్రాచార్య, పండాల సతీశ్‌గౌడ్‌లు ఇంటింటి ప్రచారం చేశారు. ఇక కేపీహెచ్‌బీ కాలనీ సర్వీస్ రోడ్డులో నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అక్రమ్ నాయకత్వంలో పలువురు చిరు వ్యాపారులు కృష్ణారావు నాయకత్వానికి మద్ధతు ప్రకటించారు. తదనంతరం కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో శివశక్తి కల్చరల్ అసోసియేషన్ నేతలతోనూ కృష్ణారావు సమావేశమై మద్దతు కోరారు. ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డి మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్నలను కలుసుకొని ఆశీస్సులు పొందారు. చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి కాలే యాదయ్య షాబాద్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...