వేగంగా అభివృద్ధి పనులు


Sat,December 14, 2019 11:00 PM

తూప్రాన్ రూరల్: తూప్రాన్ పట్టణంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పట్టణంలో ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్, లైబ్రేరీ, మహిళా సంఘం భవనాలు పూర్తికాగా ఇటీవలే ఎంపీ కొత్త వూపభాకర్‌డ్డి ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో పాటే రూ.కోటితో నిర్మించతలపెట్టిన డంపింగ్‌యార్డుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, మున్సిపల్ భవన నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. దీంతో పాటే పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. పట్టణంలోని వేంక థియేటర్ వీధిలో రూ.10 లక్షలతో అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు యుద్ధవూపాతిపధికన జరుగుతున్నాయి. తూప్రాన్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు జరుగాలంటూ ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి ఆకాంక్షించారు. తూప్రాన్ (పాత తూప్రాన్ పంచాయతీ) పట్టణంలోని రోడ్లు ఇరుకుగా ఉన్నందున ప్రతి వీధిలో అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లను నిర్మిస్తే పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు సంతోషంగా ఉంటారని ఎంపీ అధికారులకు సూచించారు.

పాత తూప్రాన్ పంచాయతీలో రోడ్లు ఇరుకుగా ఉన్నందున (15 నుంచి 20 ఫీట్లు) ఇండ్లకు నష్టం వాటిల్లకుండా సీసీ రోడ్లు, అండర్‌క్షిగౌండ్ డ్రైనీజీలు నిర్మించాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీలు నిర్మించడం ద్వారా రోడ్లు వెడల్పు అవుతాయన్నారు. పాత తూప్రాన్ పట్టణం ఇరుకుగా ఉన్నందున బాహ్యరహదారిని నిర్మించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాధనలు సిద్ధం చేయాలని సూచించారు. అయితే కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో 30 నుంచి 40 ఫీట్ల మేరకు రోడ్లు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకే ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించి వాటి వివరాలు సేకరించారు. స్థానిక దళిత కాలనీ నుంచి మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లి వరకు సుమారు 80 కాలనీలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నిర్మించాల్సిన అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లకు సంబంధించిన ప్రతిపాధనలు సిద్ధం చేశారు.

సీసీ రోడ్లు,అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీల నిర్మాణాలపై ప్రతిపాదనలు
సిద్ధం చేశాం: కమిషనర్ ఖాజామొజియొద్దీన్
ఎంపీ ఆదేశాల మేరకు తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో నిర్మించాల్సిన సీసీ రోడ్లు, అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీల నిర్మాణాలు గుర్తించాం. ప్రజావూపతినిధులు, ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి అభివృద్ధి నివేధికను తయారు చేశాం.
పట్టణంలోని పలు కాలనీల్లో సర్వే చేస్తాం: పీఆర్ డీఈ నర్సింహులు
తూప్రాన్ పట్టణ ప్రజలకు ఇబ్బందు లు కలుగకుండా ఉండేందుకు బాహ్యరహదారి నిర్మించాలని ఎంపీ కొత్త వూపభాకర్‌డ్డి ఆదేశించారు. ఇరుకుగా ఉన్న అన్నీ కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న కాలనీల్లో పర్యటించి వివరాలు సేకరిస్తాం.పట్టణంలో ఎక్కడ ఇరుకు రోడ్డు ఉంది..? ఎక్కడెక్కడ రోడ్డు ఎంతమేరలో విస్తరించాలన్నది సర్వే తర్వాతే వెల్లడవుతుంది.
ప్రజలను భయవూబాంతులకు గురిచేయొద్దు: టీఆర్‌ఎస్ శ్రేణులు
పాత తూప్రాన్ పంచాయతీలో రోడ్లు ఇరుకుగా ఉన్నందునే బాహ్యరహదారిని నిర్మించాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని కాలనీలకు నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు సృష్టిస్తున్న వదంతులు నమ్మో ద్దూ. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త వూపభాకర్‌డ్డి ఎవ్వరికి నష్టం కలిగించబోరూ. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దుష్ప్రచారాలు, వదంతులు సృష్టిస్తురన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. వేంక థియేటర్ కాలనీలో జరుగుతున్న తరహాలోనే మిగతా కాలనీలో అండర్‌క్షిగౌండ్ డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతాయి.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...