ఆర్యవైశ్యులు ఆర్థికంగా ఎదగాలి


Sat,December 14, 2019 10:59 PM

రామాయంపేట: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు ఆర్థికంగా ఎదుగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు శివనంది నారాయనగుప్తా అన్నా రు. శనివారం రామాయంపేటకువచ్చిన ఆయన వైశ్య భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. నేడు జరిగే జిల్లా ఆర్యవైశ్య మహాసభకు జిల్లాలోని ఆర్యవైశ్యులందరు వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు, మున్సిపల్ ఎన్నికలపై చర్చ, క్యాలండర్ ఆవిష్కరణ, దాతలకు సన్మానాలు,గోశాలకు ఆర్థిక సాయం, జిల్లా, మండల, గ్రామీణస్థాయి కమిటీలపై చర్చలు ఉంటాయన్నారు. ఈ కార్యక్షికమంలో మండలశాఖ అధ్యక్షుడు సూదం మల్లేశం, పట్టణ శాఖ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ, మహిళా అధ్యక్షురాలు కాముని రాధ, ఎనిశెట్టి అశోక్, కొవ్వూరి లక్ష్మణ్, శ్రీధర్‌గుప్తా, తోట కిరణ్ ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...