నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలి


Sat,December 14, 2019 10:59 PM

తూప్రాన్‌రూరల్ : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గడ ప్రత్యేకాధికారి ముత్యండ్డి అన్నారు. పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీలో రూ.4 కోట్లతో జరుగుతున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నిర్మాణం పనులు, రూ. 2కోట్లతో జరుగుతున్న మున్సిపల్ భవన నిర్మాణం పనులు పరిశీలించారు. పట్టణ శివారులో రూ.కోటితో జరుగుతున్న వైకుం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ భవన నిర్మాణ పనులు మార్చిలోగా పూర్తి చేయించేందుకు సంబంధితశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మున్సిపాలిటీ పట్టణంతో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. పనుల విషయంలో కాంట్రాక్టర్లు అలసత్వం చూపించొద్దని ఆయన సూచించారు. కార్యక్షికమంలో పంచాయతీరాజ్‌శాఖ ఏఈ విజయ్‌వూపకాశ్ పాల్గొన్నారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్: మనోహరాబాద్ మండలం కూచారంలో గడా ఓఎస్డీ ముత్యండ్డి శనివారం పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న వైకుం మహిళాభవనం, రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనుల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా పెండింగ్ వర్కులు గ్రామంలో లేకుండా చూడాలన్నారు. అందకు ముందు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను సేకరించారు. ఇదిలా ఉండగా కూచారం ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం స్నాక్స్‌ను తన సొంత ఖర్చుతో అందజేయడంపై సర్పంచ్ నరేందర్‌డ్డిని అభినందించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్షికమంలో పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...