‘ఛార్జీల చెల్లింపు అభినందనీయం’


Fri,December 13, 2019 10:55 PM

హవేళిఘనపూర్‌: దూర ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు వస్తున్న విద్యార్థినులకు ప్రభుత్వం రూ.6వేల చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించడం అభినందనీయమని కూచన్‌పల్లి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కరణం రామకృష్ణ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్ర భుత్వం రవాణా ఛార్జీల కింద మండల పరిధిలోని మద్దుల్‌వాయి గ్రామానికి చెందిన ఇంగ్లిష్‌ మీడియం 8వ తరగతి విద్యార్థిని సహితకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థులకు ఏడాదికి రూ.7వేల చెల్లిస్తుందన్నారు. అందులో భాగంగానే విద్యార్థికి చెక్కు ను అందజేశామన్నా రు. ఇదే మాదిరిగా మండల పరిధిలోని ఫరీద్‌పూర్‌, మగ్దూంపూర్‌, తొగిట, ము త్తాయికోట గ్రామాల నుంచి చదువుకునేందుకు వస్తున్న మరికొందరు విద్యార్థులకు కూడా రూ.7 వేల చెప్పున అందజేసి వారిని ప్రోత్సహించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ వైస్‌ చైర్మన్‌ భూలక్ష్మి, యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...