అడవుల శాతాన్ని పెంచాలి


Thu,December 12, 2019 11:45 PM

నర్సాపూర్ రూరల్ : అడవుల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రుస్తుంపేట్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గురువారం కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. అడవిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అటవీ ప్రాంతమంత కలియదిరుగుతూ అధికారులకు సూచనలను, సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోతుల బారి నుంచి బయటపడాలంటే అడవుల్లో పండ్ల మొక్కలను పెంచాలన్నారు. అడవుల్లో పండ్లు దొరకక కోతులు గ్రామాల్లో సంచరిస్తున్నాయని పండ్ల మొక్కలను పెంచడం వలన అడవులకు తిరుగి వెళ్లిపోతాయి. అలాగే ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలను కాపాడకపోతే సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తప్పవని వెల్లడించారు.

ప్లాస్టిక్‌ను నిర్మూలించాలి..
ప్టాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు చెత్తను ఆరుబయట వేయకుండా చెత్త బుట్టలను వాడాలని తెలిపారు. చెత్తను ఆరుబయట వేయకుండా చెత్త బండిలోనే వేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో పీడీ సీతారామారావు, సర్పంచ్ విజయభాస్కర్, ఎంపీటీసీ లక్ష్మీఅశోక్, తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో మార్టీన్ లూథర్, ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...