మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి


Thu,December 12, 2019 11:45 PM

కొల్చారం : వచ్చే వర్షాకాలం వరకు మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన కొల్చారంలోని అటవీప్రాంతంలో నాటిన హరితవనాలను గురువారం కలెక్టర్ ధర్మారెడ్డి, డీఆర్‌డీవో సీతారామారావులు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్న విధానాన్ని, మొక్కల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అక్కడ ఉన్న వాచర్లను అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా మొక్కలను వచ్చే వర్షాకాలం వరకు కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ ఉమారాజాగౌడ్, సొసైటీ చైర్మన్ మనోహర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయిలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...