ఈనెల 17, 18 తేదీల్లో జెడ్పీస్థాయీ సంఘం సమావేశాలు


Thu,December 12, 2019 12:25 AM

మెదక్‌ కలెక్టరేట్‌ : ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మీబాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17వ తేదీ ఉదయం 11 గంటలకు 3వ స్థాయీసంఘం (వ్యవసాయం) సమావేశం జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎం.లావణ్యరెడ్డి అధ్యక్షతన, మధ్యాహ్నం 2గంటలకు 5వ స్థాయీ సంఘం సమావేశం (స్త్రీ, శిశు సంక్షేమం) కొల్చారం జెడ్పీటీసీ ఎం.మేఘమాల సంతోశ్‌కుమార్‌ అధ్యక్షతన, 3గంటలకు 6వ స్థాయీ సంఘం (సాంఘిక సంక్షేమం) సమావేశం రామాయంపేట జెడ్పీటీసీ జె.సంధ్య అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం పది గంటలకు 2వ స్థాయీ సంఘం (గ్రామీణాభివృద్ధి )సమావేశం జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.హేమలతా శేఖర్‌గౌడ్‌ అధ్యక్షతన, ఉదయం 12 గంటలకు స్థాయీ సంఘం 4 (విద్య, వైద్యం) సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అధ్యక్షతన, మధ్యాహ్నం 2 గంటలకు స్థాయీసంఘాలు 1, 7 (ఆర్థిక, ప్రణాళిక, పనులు కమిటీలు) సమావేశాలను జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సకాలంలో హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.

20న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం
- మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహణ
మెదక్‌ కలెక్టరేట్‌ : జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ ఆడిటోరియంలో ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మీబాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు హేమలత అధ్యక్షతన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సకాలంలో హాజరుకావాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని కోరారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...