హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశానికి గిరిజన విద్యార్థులకు ఆహ్వానం


Thu,December 12, 2019 12:24 AM

మెదక్‌ కలెక్టరేట్‌ : గిరిజన సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట, రామంతాపూర్‌లలో 1వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో ఆరు సీట్లలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి డి.సుధాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు సీట్లు బాలురకు, రెండు సీట్లు బాలికలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2014 జూన్‌ 1వ తేదీ నుంచి 2015 మే 31లోపు పుట్టిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని వివరించారు. ఆసక్తి గల విద్యార్థులందరూ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారం నింపి తహసీల్దార్‌ నుంచి పొందిన ఆదాయం, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలు మెదక్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయంలో ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 19వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.లక్షా యాభై వేల లోపు ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలలోపు ఉండాలన్నారు. ఈనెల 21వ తేదీన ఉదయం పదకోండు గంటలకు విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...