కూరగాయల సాగును విస్తృతపర్చాలి


Mon,December 9, 2019 11:22 PM

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ : కూరగాయల సాగును విస్తృతపర్చేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఉల్లి విత్తనాలను సబ్సిడిపై సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం మంత్రి నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి నారాయణఖేడ్‌లో ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉల్లిగడ్డ ధర విపరీతంగా పెరిగిన సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్‌లో సబ్సిడీపై రూ.40లకు కిలో చొప్పున ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలను విధిగా సందర్శిస్తూ అక్కడ ఎటువంటి అవతవకలు జరుగకుండా చూడాలన్నారు. కిచెన్‌గార్డెన్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పందిరి సాగుకు 90 శాతం సబ్సిడీ..
పందిరి సాగుపై ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 40 మంది రైతులకు పందిరిసాగు మంజూరైన సందర్భంగా వారికి మంజూరు పత్రాలను అందజేశారు. పందిరిసాగు యూనిట్‌ ధర రూ.1.17 లక్షలు కాగా రూ.1.07 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతుల ఆసక్తిని బట్టి అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో ఒక యూనిట్‌ పందిరిసాగు చేసుకోవచ్చన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...