ఆర్టీసీ కాంట్రాక్టు క్రమబద్ధీకరిన


Sun,December 8, 2019 11:13 PM

-మెదక్‌ రీజియన్‌లో 42 మందికి పర్మినెంట్‌
-ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
-మహిళా కండక్టర్లకు రాత్రి 8.00గంటల వరకే డ్యూటీ

సంగారెడ్డి టౌన్‌ : ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని 42మంది కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువరించినట్లు మెదక్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ తెలిపారు. మెదక్‌ రీజియన్‌లోని 42 మంది కాంట్రాక్టు ఉద్యోగులలో 35 మంది డ్రైవర్లు, 7మంది కండక్టర్లను పర్మినెంట్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ప్రకటించారు. ఇచ్చి న హామీ మేరకు శనివా రం రాత్రి ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల్లో పనిచేస్తున్న కాం ట్రాక్టు డ్రైవర్‌, కండక్టర్లను పర్మినెంట్‌ చే స్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

మహిళా కండక్టర్లకు రాత్రి 8గంటల వరకే డ్యూటీ..
మహిళా కండక్టర్లకు రాత్రివేళల్లో డ్యూ టీలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ ని ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం వివరించారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్‌ మహిళా ఉద్యోగులు, కండక్టర్లకు రాత్రి 8.00 గంటల వరకే డ్యూటీలు వేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆదివారం నుంచి మహిళా కండక్టర్లకు రాత్రి 8.00 గంటల వరకే డ్యూటీలు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. మెదక్‌ రీజియన్‌ పరిధి లో పనిచేస్తున్న మహిళా కండక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles