అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి


Thu,December 5, 2019 11:25 PM

-మెదక్‌లో చేపల ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరిస్తాం
-అర్హులందరికీ కల్యాణలక్ష్మి చెక్కులు
-పోచారం డ్యామ్‌లో రొయ్య పిల్లలను వదిలిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
-చిన్నశంకరంపేట మండలం చందంపేటలో పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు

హవేళిఘనపూర్‌ : మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని పోచారం డ్యాంలో రొయ్య పిల్లలను వదిలారు. అనంతరం మండలంలోని చౌట్లపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై చేప, రొయ్య, పిల్లలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మెదక్‌లో ఉన్న చేపల ఉత్పత్తి కేంద్రాన్ని పునరుద్ధరించుకుంటే అన్ని ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు వీలుంటుందన్నారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ద్విచక్రవాహనాలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై అందజేయడం జరిగిందన్నారు. అనంతరం చౌట్లపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రంలో బోధన తీరు, పౌష్టికాహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. చౌట్లపల్లి సర్పంచ్‌ లక్ష్మి, గ్రామస్తులు సీసీ రోడ్లు, గ్రామ సేవకులు, శ్మశాన వాటిక నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్‌లను అందజేశారు.

కల్యాణలక్ష్మితో పేదలకు భరోసా..
పేద ఆడ బిడ్డలు ఉన్న తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ వారికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో చేయూతనిస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రం మెదక్‌ టీఎన్జీవో భవన్‌లో హవేళిఘనపూర్‌, మెదక్‌ మండలాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సాయంగా సీఎం కేసీఆర్‌ కల్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి రూ.లక్షా1116లను అందజేస్తున్నారన్నారు.

మెదక్‌, హవేళిఘనపూర్‌లలో జరిగిన కార్యక్రమాల్లో హవేళిఘనపూర్‌, మెదక్‌ ఎంపీపీలు శేరి నారాయణరెడ్డి, యమునజయరాంరెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, జెడ్పీటీసీ సుజాత, హవేళిఘనపూర్‌ ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాధాకిషన్‌యాదవ్‌, జేసీ నగేశ్‌, ఏడీఏ శ్రీనివాస్‌, మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు, తహసీల్దార్‌ వెంకటేశం, పోచారం మత్స్య సహకార సంఘం చైర్మన్‌ సాయిలు, హవేళిఘనపూర్‌, టీఆర్‌ఎస్‌ మెదక్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, సర్పంచులు లింగం, సవితశ్రీకాంత్‌, పద్మవెంకట్‌, ఎంపీటీసీలు మంగ్యా, జ్యోతిసిద్ధిరెడ్డి, కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిలు, సంతోశ్‌, నరేందర్‌రెడ్డి, సాప శ్రీనివాస్‌, శంకర్‌, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మండలం చందంపేటలో..
చిన్నశంకరంపేట : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని చందంపేటలో జరుగుతున్న పెద్దమ్మతల్లి ప్రథమ వార్షికోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి పురోహితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవాల సందర్భంగా పెద్దమ్మ పెద్దిరెడ్డి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పట్లోరి మాధవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, మాజీ ఎంపీపీ అరుణ, ఎంపీటీసీ శివకుమార్‌, సర్పంచులు శ్రీలత, మీనా, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌, నాయకులు ప్రభాకర్‌, సాన సత్యనారాయణ, స్వామి, శేఖర్‌గౌడ్‌, రమేశ్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles