మొక్కల పెంపకంపై శ్రద్ధచూపాలి


Thu,December 5, 2019 11:22 PM

టేక్మాల్‌: నర్సరీల్లో మొక్కల పెంపకంపై శ్రద్ధ్ద చూపాలని ఎంపీడీవో హిరణ్మయి అన్నారు. ఉపాధి హామీ తో నిర్వహిస్తున్న మండల పరిధిలోని బోడగట్టు, కమ్మరికత్త, సూరంపల్లి, ఎల్లుపేట నర్సరీలను గురువారం ఆమె పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయాలని, కలుపు లేకుండా చూడాలని చెప్పారు. అలాగే నర్సరీల చుట్టూ కంచె, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలు పరిశీలించారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఏపీవో పౌలు, టీఏ బాలరాజ్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles