ఇంటర్‌ సిలబస్‌ పూర్తి చేయండి


Thu,December 5, 2019 12:21 AM

రామాయంపేట: ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు త్వరలోనే రానున్నందున లెక్చరర్లు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని ప్రతిక్లాస్‌ రూంలో సీసీ కెమెరాలను బిగించాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సూర్యప్రకాశ్‌ అన్నారు. బుధవారం రామాయంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించిన విద్యాధికారి రికార్డులను, క్లాస్‌రూంలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ రాబోయే సంవత్సరం ఫిబ్రవరిలో ఉన్నందున లెక్చరర్లు సెలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణతను సాధించేలా లెక్చరర్లు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి వారి సబ్జెక్టులకు స్లిప్‌ టెస్టులను పెట్టాలన్నారు. విద్యాధికారి వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ సిద్దరాంరెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ గుణవర్దన్‌, కళాశాల లెక్చరర్లు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...