వారం వారం శ్రమదానం చేయాలి


Thu,December 5, 2019 12:20 AM

-30రోజుల కార్యాచరణ ప్రణాళిక ఫలితాన్నిచ్చింది
-జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌

మనోహరాబాద్‌ : గ్రామాలను స్వచ్ఛత దిశగా నడిపించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాన్నిచ్చిందని జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండల కేంద్రంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దశబ్ధాల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో తెలంగాణ అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, కొన్ని దేశాల ప్రతినిధులు ప్రశంసించారన్నారు. ప్రగతి ప్రణాళిక పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా మహిళలు, యువకులు చైతన్యవంతం కావాలన్నారు. ఆరోగ్య తెలంగాణలో రాష్ట్రంలో మెదక్‌ జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని, దానిని మొదటి స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

కాగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా గ్రామాల్లో యువకులు ప్రతి ఆదివారం శ్రమదానం చేస్తున్నారని, ఇందులో సర్పంచ్‌ల పట్టుదల ఎంతగానో ఉందని అభినందించారు. అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌ ఇదివరకే నిధులను మంజూరు చేశారని, త్వరలో మరిన్ని నిధులు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు శేఖర్‌గౌడ్‌, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ మహేందర్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్‌ తీగుళ్ల నాగిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ మంగ్యా నాయక్‌, నాయకులు హన్మంతరావు, పంజా భిక్షపతి ముదిరాజ్‌, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...