ఏ ఆపద వచ్చినా100కు డయల్‌ చేయాలి


Thu,December 5, 2019 12:19 AM

రామాయంపేట: విద్యార్థినిలు ధైర్యంగా ఉండాలని మీకు ఏ ఆపద వచ్చినా మేమున్నాం, 100కు కాల్‌ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీ ముందుంటారని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం రామాయంపేటలోని కళాశాలల విద్యార్థినిలతో ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు సలహాలిచ్చారు. ఎక్కడకు వెళ్లినా మ హిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రామాయంపేట సబ్‌రిజిస్ట్రర్‌ సుబ్బలక్ష్మి, సీఐ నాగార్జునగౌడ్‌, ఎస్‌ఐ మహేందర్‌ ఉన్నారు.

మహిళల భద్రతపై అవగాహన
తూప్రాన్‌ రూరల్‌: యువతులు, మహిళలు, చదువుకుంటున్న బాలికలు అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్‌ సీఐ స్వామిగౌడ్‌ అన్నారు. తూప్రాన్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బుధవారం సాయంత్రం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలలు, పాఠశాలలు, వివిధ అసరాల నిమిత్తం వెళ్లే సమయాల్లో జాగ్రత్త పడాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడూ తమ తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. ఆటోలు, క్యాబ్‌ లు, ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణీస్తే వాహనాల నెంబర్‌లు, ప్రదేశాన్ని ఫోన్‌లో మెసేజ్‌ పెట్టాలన్నారు.

అపరిచిత వ్యక్తుల వాహనాల్లో ప్రయాణం చేయరాదన్నారు. ఆపదలో ఉన్న సమయాల్లో 100 నెంబర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో ఆత్మరక్షణకు కృషి చేయాలన్నారు. మహిళలు, యువతులు, బాలికలు ఒంటరిగా ఉండొద్దని, జన సంచారం కలిగిన ప్రదేశాల్లో ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లు,100 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.కార్యక్రమంలో తూప్రాన్‌ ఎస్‌ఐ-2 యాదవరెడ్డి,అధ్యాపకులు,విద్యార్థులుపాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...