గర్భిణులు పోషకాహారాన్ని తీసుకోవాలి


Thu,December 5, 2019 12:19 AM

మనోహరాబాద్‌: బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అంగన్‌వాడీ కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తుందని ఎంపీటీసీ నత్తి లావణ్య అన్నారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ అంగన్‌వాడీ కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కమిటీ చైర్‌ పర్సన్‌గా ఎంపీటీసీ నత్తి లావణ్యను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దారిద్య్రరేఖకు దిగువలో ఉన్న కుటుంబాల బాలబాలికలకు, మహిళలకు పౌష్టికాహారాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి రూపంలో అందజేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి రోజు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు గుడ్లు, పాలుతో పాటు మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అంతేకాకుండా 6 నెలల నుంచి ఆరేండ్ల వయస్సున్న బాలబాలికలకు విటమిన్లు కలిగిన బాలామృతంను అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు వరలక్ష్మి, ఆశ వర్కర్లు అనురాధ, అంగన్‌వాడీ కార్యకర్తలు సుశీల పాల్గొన్నారు.

నిజాంపేటలో...
నిజాంపేట: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారి రాజు, నిజాంపేట గ్రామ సర్పంచ్‌ అనూష గర్భిణులకు కూరగాయల విత్తనాల మినీ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అనూష మాట్లాడుతూ ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాలలో కూరగాయల విత్తనాలను వేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేసిన ఈ విత్తనాలతో ఆకు కూరలను పండించి గర్భిణులు ఆహారంగా తీసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు కొమ్మట మణెమ్మ, అరుణ, రేణుక, సుగుణమ్మ, గర్భిణులు ఉన్నారు.

వెల్దుర్తిలో...
వెల్దుర్తి: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో విత్తనాలను అందజేస్తునున్నట్లు మండల వ్యవసాయ అధికారి మాలతి అన్నారు. బుధవారం శంశిరెడ్డిపల్లిలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార విత్తనాలను ఏఈవోలు సాయి, గౌతమి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రణీత్‌రెడ్డి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...