‘అభ్యంతరాలను స్వీకరిస్తాం’


Thu,December 5, 2019 12:18 AM

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ పట్టణంలో మున్సిపాలిటీ వార్డుల నోటిఫికేషన్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని తూప్రాన్‌, బ్రాహ్మణపల్లి, పడాల్‌పల్లి, అల్లాపూర్‌, పోతరాజుపల్లి, రావెళ్లిలో 16 వార్డులను ఏర్పాటు చేశారు. 16 వార్డులకు సంబంధించిన జాబితాను కమిషనర్‌ ఖాజామొజియొద్దీన్‌ బుధవారం ప్రచురించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 సెన్సెక్స్‌ ప్రకారం తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలో 23,673 మంది జనాభా ఉండగా, 17,176 మంది ఓటర్లు ఉన్నారని, వీటిలో 16 వార్డులుగా విభజించామన్నారు.

వార్డులకు సంబంధించిన నోటిఫికేషన్‌ మున్సిపాలిటీ, ఆర్డీవో, మండల రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో నోటీస్‌ బోర్డులపై అతికించామన్నారు. బుధవారం నుంచి ఈ నెల 9వరకు ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రతినిధుల నుంచి వచ్చే ఆలోచనలు, సూచనలు, సలహాలు, విజ్ఞప్తులను (అభ్యంతరాలు) లిఖిత పూర్వకంగా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని స్వీకరిస్తామన్నారు.

రోజువారీగా వచ్చిన సూచనలు, సలహాలు ఏ రోజుకారోజే పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రక్రియ 16వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. తమ దృష్టికి వచ్చిన సలహాలు, ఆలోచనలు, సూచనల (అభ్యంతరాలు)పై విచారణ జరిపి స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇస్తామన్నారు. తమ దృష్టికి వచ్చిన అభ్యంతరాలు మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రత్యేకాధికారి ఆమోదంతో ఈ నెల 17న ఫైనల్‌ నోటిఫికేషన్‌ ప్రచురిస్తామని చెప్పారు. బుధవారం ప్రజల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు రాలేదని కమిషనర్‌ ఖాజామొజియొద్దీన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది మక్భూల్‌, హన్నాన, యాదగిరి, సమీర్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...