వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


Tue,December 3, 2019 11:54 PM

-పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
-హెచ్‌ఐవీ, టీబీ వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
-ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలి
-తూప్రాన్, మనోహరాబాద్ మండలాల వైద్య సిబ్బందికి సూచించిన డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు

తూప్రాన్ రూరల్ : డెంగీ, మలేరియా, టైపాయిడ్ వ్యాధుల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో వెంక సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా నియంవూతణ, ప్యామిలీ ప్లానింగ్, కేసీఆర్ కిట్ల పంపిణీ, మాతాశిశు మరణాల తగ్గింపు, వ్యాధులు సోకకుండా తీసుకునే చర్యలపై ఆయన అవగాహన కల్పించారు. కుటుంబ నియంవూతణకు పాటించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చూడాలన్నారు. గ్రామాల్లో పౌష్టికాహార పదార్థాలు తీసుకోకపోవడంతో మాతా శిశు మరణాలు పెరుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇంటి పరిసరాలు పరిశువూభంగా లేకపోతే మలేరియా, డెంగీ, టైపాయిడ్ వంటి వ్యాధులు సక్రమించే అవకాశం ఉందన్నారు. వ్యాధులు సక్రమించినట్లు సమాచారం అందిన వెంటనే గ్రామాలకు వెళ్లి చికిత్సలు అందించాలన్నారు. హెచ్‌ఐవీ వ్యాధిపై అవగాహన కల్పించి సరైన చికిత్స చేయించుకుంటే వారి జీవిత కాలాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని, ఇలాంటి కార్యక్షికమాలపై విస్తృతంగా ప్రచారం, అవగాహన కార్యక్షికమాలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వ దవాఖానల్లో డెలీవరీలు చేయించుకుంటే కేసీఆర్ కిట్లు అందజేస్తామని, ప్రభుత్వ దవాఖానాల్లో చేరేలా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్షికమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో అరుణశ్రీ, తూప్రాన్ పీహెచ్‌సీ డాక్టర్‌లు ఆనంద్, భావన, సీహెచ్‌వో బాల్‌నర్సయ్య, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...