పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి


Tue,December 3, 2019 12:13 AM


-గ్రామ పరిశుభ్రతకు అందరూ సహకరించాలి
-నిర్మించుకున్న మరుగుదొడ్డిని వాడుకోవాలి
-చెత్తను డంపుయార్డుకు తరలించాలి

మనోహరాబాద్: గ్రామాలను పరిశువూభంగా ఉంచుకోవాలని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేట మండలం బీమ్లాతండాలో సోమవారం చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పరిసరాలను పరిశువూభంగా ఉంచుకున్న రోజే గ్రామాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. శివ్వంపేట మండలంలోని అన్ని గ్రామాలు స్వచ్ఛత వైపు పయనిస్తున్నాయని, మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుంటామన్నారు. బీమ్లాతండాలోని ప్రభుత్వ పాఠశాలను ఎంపీపీ కల్లూరి హరికృష్ణ సందర్శించారు. విద్యాబోధన ఎలా జరుగుతుంది, విద్యార్థులకు ఎమైన సమస్యలు ఉన్నాయ అని చర్చించారు. ఈ కార్యక్షికమంలో ఎంపీడీవో నవీన్‌కుమార్, సర్పంచ్ చెన్నానాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.


ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం తప్పనిసరి
నిజాంపేట: గ్రామస్తులు తమ ఇంటిని, పరిసరాలను పరిశువూభంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని నిజాంపేట సర్పంచ్ అనూష అన్నారు. నిజాంపేటలో సోమవారం సర్పంచ్ అనూష ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ గ్రామస్తులు విధిగా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అన్నారు. కార్యక్షికమంలో ఎంపీటీసీ లహరి, పీఏసీఎస్ చైర్మన్ కిష్టాడ్డి, ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, పంచాయతీ సెక్రటరీ సంధ్యారాణి, వార్డు మెంబర్లు మావురాం రాజు, తిరుపతి, తిరుమల్‌గౌడ్, ఏసుమణి, లక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, అంగన్‌వాడీలు మణెమ్మ, రేణుక, దుర్గేశ్వరీ, కారోబార్ కొండల్‌డ్డి, ఆశావర్కర్‌లు బాలమణి, లక్ష్మి, గ్రామస్తులు రాజం, జహీరుద్ధీన్, తమ్మల రమేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు.

పాఠశాల ఎదుట చెత్తపై సర్పంచ్ ఆగ్రహం
వెల్దుర్తి: కస్తూర్బా పాఠశాల ఎదుట చెత్త పారబోతపై సర్పంచ్ భాగ్యమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల ఎదుట నుంచి వెళ్తుండగా పాఠశాలలోని చెత్తను పాఠశాలకు వెళ్లే ప్రధాన గేటు పక్కన పారబోయడం, అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడాన్ని గమనించిన సర్పంచ్ పాఠశాల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలతో పాటు ఆవరణను పరిశువూభంగా ఉంచుకోవాలని, వెంటనే చెత్తను తొలగించాలని ఆదేశించడంతో కస్తూర్బా పాఠశాల సిబ్బంది చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...