మనోహరాబాద్ మండల అభివృద్ధికి కృషి


Sun,December 1, 2019 12:24 AM

మనోహరాబాద్ : స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్న మనోహరాబాద్ మండల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి అన్నారు. మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్, కూచారం, ముప్పిడ్డిపల్లి, పాలాట, రామాయిపల్లి, కోనాయిపల్లి పీటీ గ్రామాల్లో జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌డ్డి, రాష్ట్ర మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌డ్డిలతో కలిసి శనివారం రూ.17కోట్ల 55లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా గ్రామాలను పట్టించుకోలేదు.

కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఆయన నియోజకవర్గంలోని గ్రామాలు నేడు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. మనోహరాబాద్ మండలంలో ఏ అభివృద్ధి పనులకైనా ముందుండి పని చేస్తామని, నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. కాగా మనోహరాబాద్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు కావాలని ఎంపీపీ పురం నవనీతారవి ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డిని కోరారు. దీనికి ఎంపీ వెంటనే స్పందించి త్వరలోనే వాటిని మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన కాళ్లకల్‌లో ఉన్న కాలనీ రోడ్లు ఇరుకుగా ఉండటంతో పాటు రద్దీగా ఉంటాయని, అత్యవసర పరిస్థితిలో ప్రయాణం చేయాలంటే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. దీనిని అధిగమించేందుకు బంగారమ్మ దేవాలయం నుంచి కాళ్లకల్ చుట్టూ తిరిగి జనతా హోటల్ వరకు రింగ్‌రోడ్డును మంజూరు చేయడం జరిగిందన్నారు. రింగురోడ్డు వల్ల భూములు, ఇండ్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని, రింగురోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు.

అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ సమిష్టి కృషితో గ్రామాల అభివృద్ధి చేసుకుందాన్నారు. రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌డ్డి మాట్లాడుతూ తెలంగాణలో అటవీశాతాన్ని పెంపొందించడానికి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్షికమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. అందుకు అనుగుణం ప్రతి ఒక్కరం మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌డ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. గజ్వేల్, తూప్రాన్ తరహాలో మనోహరాబాద్, కాళ్లకల్‌లో వెడల్పైన రోడ్లు, వీధి దీపాలతో మెరువబోతున్నాయన్నారు.


శంకుస్థాపనల వివరాలు..
కాళ్లకల్‌లో రూ. 50 లక్షలతో నిర్మించబోయే రోడ్డు వెడల్పు పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో నిర్మించబోయే మార్కెట్ రోడ్డు నిర్మాణానికి, రూ.10లక్షలతో నిర్మించబోయే జెడ్పీహెచ్ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూచారంలో రూ.కోటితో సీసీరోడ్లు, అంతర్గత మురికి కాల్వలకు, రూ.10లక్షలతో యూత్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముప్పిడ్డిపల్లిలో రూ.10లక్షలతో యూత్ భవనం, రూ.10లక్షలతో మీటింగ్‌హాల్, పాలాటలో రూ.20 లక్షలతో సీసీరోడ్లు, మురికికాల్వలు, రూ.10లక్షలతో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రామాయిపల్లిలో రూ. కోటీ యాబై లక్షలతో నిర్మించబోయే దొంతి నుంచి మల్కాపూర్ వరకు రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. కోనాయిపల్లి పీటీలో రూ.25లక్షలతో ఫంక్షన్‌హాల్ నిర్మాణ
పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్షికమంలో గడా ముత్యండ్డి, ఆర్డీవో శ్యామ్‌వూపకాశ్, తహసీల్దార్లు శ్రీదేవి, నజీబ్ అహ్మద్, ఎంపీపీలు పురం నవనీతారవి ముదిరాజ్, గడ్డి స్వప్న, వైస్ ఎంపీపీ విఠల్‌డ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మెట్టు బాలకృష్ణాడ్డి, ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్, రైతు సమన్వయ సమితి మండల కో- ఆర్డినేటర్ సుధాకర్‌డ్డి, పీఏసీఎస్ చైర్మన్ దీపక్‌డ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్‌డ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్ ముదిరాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, ఎంపీటీసీ నత్తి లావణ్య, సర్పంచులు భాషబోయిన ప్రభావతి, నరేందర్‌డ్డి, పూల అర్జున్, ఉప సర్పంచ్‌లు ధర్మేందర్, మహేందర్‌గౌడ్, నాయకులు కృష్ణాగౌడ్, పంజా భిక్షపతి, చంద్రశేఖర్ ముదిరాజ్, రమేశ్, దశరథ, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...