ఇక్కట్లు లేకుండా ప్రయాణం


Tue,November 19, 2019 11:45 PM

-జిల్లాలో తిరిగిన 82 బస్సులు
-ఆర్టీసీకి చెందినవి 47, అద్దె బస్సులు 35
-కనిపించని కార్మికుల సమ్మె ప్రభావం
-అన్ని రూట్లను పర్యవేక్షించిన అధికారులు

మెదక్ అర్బన్ : జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా వివిధ రూట్లలో తిరుగుతుండటంతో జిల్లాలోని ప్రయాణికులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు ఫలించడంతో జిల్లాలో బస్సులు అన్ని రూట్లలో తిరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు 46 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సేవలు అందుతున్నాయి. ప్రతి రూట్లలో నడిచే బస్సులను ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మెదక్ డిపో బస్సులు మారుమూల పల్లెతోపాటు పట్టణాలకు సైతం బస్సులు సమయానుకులంగా నడవడంతో జిల్లాలలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగడంలేదు. దీంతో జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కడ కనిపించలేదు. మంగళవారం మెదక్ డిపో నుంచి వివిధ రూట్లలో 82 బస్సులు యథావిధిగా తిరిగాయి. మెదక్ డిపోకు చెందిన 47 బస్సులు, అద్దె బస్సులు 35 జిల్లాలోని వివిధ రూట్లలోని ప్రయాణికులకు సేవలను అందించాయి. జిల్లాలో సోమవారం వివిధ రూట్లలో బస్సులు యథావిధిగా తిరగడంతో మెదక్ డిపోకు రూ. 9,04,201 ఆదాయం రాగా సోమవారం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు వేతనాలు, డీజీలతో పాటు వివిధ ఖర్చులు తీసివేయగా రూ. 5,73,601 వచ్చినట్లు మెదక్ డిపో డీఎం జాకీర్ తెలిపారు.

జిల్లాలో తిరిగిన 82 బస్సులు


ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు, డీటీవో, పోలీసులు చేపట్టిన చర్యల వల్ల జిల్లాలోని అన్ని రూట్లలో బస్సులు యథావిధిగా తిరిగాయి. మంగళవారం మెదక్ డిపో నుంచి చేగుంట మీదుగా తూప్రాన్, సికింద్రాబాద్ వరకు, కొల్చారం, నర్సాపూర్ మీదుగా బాలనగర్, ఎంజీబీఎస్ వరకు, రంగంపేట మీదుగా సంగారెడ్డి, పటాన్ వరకు, రామాయంపేట మీదుగా దుబ్బాక, సిద్దిపేట వరకు, గోపాల్ మీదుగా ఎల్లారెడ్డి, బోధన్ వరకు మెదక్ డిపో బస్సులు ప్రయాణికులకు సేవలను అందించాయి.

జిల్లాల్లో కనిపించని సమ్మె ప్రభావం


ఆర్టీసీ కార్మికులు గత 46 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ మెదక్ డిపో బస్సులు వివిధ రూట్లలోని ప్రయాణికులకు సేవలను అందించాయి. జిల్లాలో ఎక్కడ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కనిపించడంలేదు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...