సంక్షేమపథకాలను సద్వినియోగం చేసుకోవాలి


Tue,November 19, 2019 11:28 PM

చిన్నశంకరంపేట: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భాగ్యలక్ష్మి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కొర్విపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మండల పరిషత్ నిధుల నుంచి ఏర్పాటు చేసిన సింగిల్ ఫేజ్ బోర్ మోటరును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, ఎంపీటీసీ జయమ్మ, సర్పంచ్ పద్మ, మాజీ డీసీయంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ ప్రధానోపాధ్యాయురాలు హిమబిందు, ఎస్ చైర్మన్ రాంచంద్రం,పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles