పచ్చదనం పెంపొందించుకోవాలి


Tue,November 19, 2019 11:20 PM

టేక్మాల్: పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎంపీడీవో హిరణ్మయి అన్నారు. మండల పరిధిలోని తంపులూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు మంగళవారం ఆమె ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న మధ్యాహ్న భోజన వంటగది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడానికి విద్యార్థులను భాగస్వామ్యం చేయడం అభినందనీయమన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగయ్య, ఎస్ చైర్మన్ నాగయ్య, ప్రధానోపాధ్యాయురాలు రేణుక, ఉపాధ్యాయులు మమత, అమూల్య, జోత్స్న, మల్లేశం, టీఏ గంగారం, స్థానికులు, విద్యార్థులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...