మంజీరాపై 12చెక్‌డ్యాంలు


Sun,November 17, 2019 11:54 PM

హవేళిఘనపూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్య అభివృద్ధి పెద్దపీట వేసేందుకు గాను మత్స్యకారులకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వందశాతం సబ్సిడీ చేప పిల్లలను అందించడంతో పాటు త్వరలోనే మెదక్‌లో చేపల మార్కెట్ నిర్మాణానికి చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కూచన్‌పల్లి చెక్‌డ్యాంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో మూలనపడ్డ కులవృత్తుల వారిని సీఎం కేసీఆర్ ప్రోత్సహించేందుకు గాను గొల్ల కుర్మలకు సబ్సిడీపై గొర్రెలను అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తూ వారు పెంచిన చేపలను అమ్ముకునే విధంగా మెదక్‌లో చేపల మార్కెట్ నిర్మాణానికి గాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రూ.50లక్షలను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే స్థలాన్ని గుర్తించి చేపల మార్కెట్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వారు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 513 చెరువులకు గాను 2కోట్ల 8లక్షల చేపపిల్లలు వదిలామని, ఇందులో రావు, బొచ్చ, చిన్న చెరువుల్లో బంగారు తీగలు లాంటి రకాల చేపలను వదులుతున్నట్లు తెలిపారు. కులవృత్తులు అభివృద్ధి చెందితేనే వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెంపొందుతాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కులవృత్తుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

గతంలో ఆంధ్రా ప్రాంతంలో నుంచే చేపల దిగుమతి జరిగేదని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ హయాంలో మన రాష్ట్రంలో కూడా మత్స్య సంపదను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మత్స్యకారులకు వాహనాలు, చేపల మార్కెట్ సౌకర్యం, సబ్సిడీపై చేపపిల్లల పంపిణీ లాంటి ఎన్నో పనులు చేపడుతున్నారన్నారు. మంజీరాపై 14చెక్‌డ్యాంలో నిర్మాణానికి సీఎం కేసీఆర్ హామీనిచ్చారని, ఇందులో కూచన్‌పల్లి చెక్‌డ్యాం నిర్మాణం పూర్తి కాగా, ర్యాలమడుగు వద్ద ఉన్న మరో చెక్‌డ్యాం పూర్తి కావస్తున్నదని దానిని త్వరలోనే ప్రారంభిస్తామని, మిగతా 12 చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. ముఖ్యంగా కూచన్‌పల్లి దిగువ ప్రాంతంలో ఉన్న సర్దన వద్ద కూడా చెక్‌డ్యాం నిర్మించాలని ఆ ప్రాంత రైతుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే నిధులు మంజూరు చేసి నిర్మాణానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. రాబోయే జూన్, జూలై నాటికి మెదక్ నియోజకవర్గంలోని రైతులకు కాళేశ్వరం ద్వారా సాగునీటికి అందించేందుకు గాను పనులు సాగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. కొల్చారం మండలంలోని ఘణపురం ఆనకట్ట పెంపు పనులు పూర్తయితే అందులో నీరు నిల్వ ఉంచితే మత్స్య సంపదతో పాటు రైతులకు సాగునీటిని అందిస్తే రైతులు తమ పంటలను సాగు చేసుకుని సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరామ్, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షులు నర్సింహులు, మత్స్యశాఖ ఏడీఏ శ్రీనివాస్, నరేశ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కొంపల్లి సుభాశ్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు రాధాకిషన్‌యాదవ్, ఎంపీటీసీలు రాజయ్య, అర్చన శ్రీనివాస్, జ్యోతిసిద్దిరెడ్డి, రాంచందర్‌రెడ్డి, సర్పంచులు దేవాగౌడ్, మంద శ్రీహరి, ఎంపీపీ ఉపాధ్యక్షులు గొల్ల రాధాకిషన్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ కిష్టాగౌడ్, గుండారం కిరణ్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, ఉప సర్పంచ్ బయ్యన్న, రేఖమయ్య, కూచన్‌పల్లి మత్స్య సహకార సంఘం సభ్యులు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...