సజావుగా ఆర్టీసీ సేవలు


Sun,November 17, 2019 11:51 PM

మెదక్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బస్సు సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో నడుస్తున్నాయి. ఆదివారం జిల్లాలో బస్సులు యథావిధిగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మెదక్ బస్సు డిపో వద్ద పోలీసు భద్రతతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్‌తో పాటు ఇతర సిబ్బంది వివిధ రూట్లలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు.
తిరిగిన 74 బస్సులు..
జిల్లాలోని మెదక్ డిపోనకు చెందిన 41 బస్సులు, 33 అద్దె బస్సులతో మొత్తం 74 బస్సులు ఆదివారం నడిచాయి. మెదక్ నుంచి చేగుంట, తూఫ్రాన్ మీదుగా జేబీఎస్ వరకు, సంగారెడ్డి, సిద్దిపేట రూట్లలో తిరిగాయి. బోధన్, బాన్సువాడ, సంగారెడ్డి, సిద్దిపేట డిపోలకు చెందిన బస్సులు సైతం మెదక్ మీదుగా వివిధ రూట్లలో తిరుగడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...