అంగన్‌వాడీల్లో ఆంగ్ల బోధన


Sat,November 16, 2019 11:55 PM

మెదక్ మున్సిపాలిటీ : అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను ఆట, పాటలు, పౌష్టికాహారం అందించడంతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కొంతమేరకు విద్య నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు చిన్నారులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం... ఈ ఏడాది నుంచే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించింది. ఎల్‌కేజీ, యూకేజి తరగతుల బోధనకు కార్యాచరణ సిద్ధం చేసి నూతన విధానాన్ని అమలు చేస్తున్నది. మెదక్ జిల్లాలో మొత్తం 1076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 885 ప్రధాన కేంద్రాలు ఉండగా, 191 మినీ కేంద్రాలు ఉన్నాయి. మూడేళ్లలోపు విద్యార్థులు 19,405 మంది ఉండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులు 19,341 మంది ఉన్నారు.

చిన్నారులకు ఆటపాటలతో విద్య...
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా బోధన జరుగుతున్నది. చిన్నారులను గ్రూపులుగా విభజించి రోజు కనీసం 2 గంటలకు తగ్గకుండా పీరియడ్‌లు విభజించుకుని బోధన చేస్తున్నారు. నర్సరీ పిల్లలకు ఆటపాటలు, బొమ్మలు, మూడు, నాలుగేళ్లలోను వారికి ఎల్‌కేజి, నాలుగు, ఐదేళ్లలోపు వారికి యూకేజీ పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్లంలో రూపొందించిన చార్టులు బోధనకు అనుగుణంగా తరగతి గదుల్లో ప్రదర్శిస్తున్నారు. ఆంగ్లం వర్క్‌బుక్స్, ఆర్ట్ అండ్ క్రాప్ట్స్, పుస్తకం, నేను నా పరిసరాల పేరుతో ఉన్న పుస్తకాలతో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. చిన్నారులకు బోధన ఎలా చేయాలనే దానిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా సంసిద్ధ పేరుతో ఉన్న పుస్తకాలను అందజేయగా, ఇందులో పాఠాలు ఏ విధంగా బోధించాలో రూపొందించారు.

ఆ పుస్తకాల ఆధారంగా బోధన చేస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యాబోధన పేరుతో మూడు రకాల అభ్యాస దీపికలను అందించారు. వీటితోనే చిన్నారులకు బోధన చేస్తున్నారు. కొందరు చిన్నారుల తల్లిదండ్రులు మూడు, నాలుగేళ్లు దాటగానే చిన్నారులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదీ పేదవారికి భారమే అయినా పిల్లల భవిష్యత్ కోసం భరిస్తున్నామని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, బోధనకు చర్యలు చేపట్టగా, జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విజయవంతంగా అమలవుతున్నది.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...